News September 27, 2024
ఆ వెబ్సైట్లను బ్యాన్ చేసిన కేంద్రం

పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని వెల్లడించే కొన్ని వెబ్సైట్లను నిషేధించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆధార్, పాన్ కార్డ్ వంటి వివరాలను అవి బహిర్గతం చేస్తున్నాయని పేర్కొంది. ‘భారత కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ పలు వెబ్సైట్లలో భద్రతాలోపాలు ఉన్నట్లు గుర్తించింది. జాగ్రత్తలెలా తీసుకోవాలి, లోపాలను ఎలా సరిచేసుకోవాలనేదానిపై ఆయా సైట్స్ యజమానులకు అధికారులు సూచనలు చేశారు’ అని వివరించింది.
Similar News
News December 16, 2025
పంటల్లో ఎర్రనల్లిని ఎలా నివారించాలి?

ఎర్రనల్లి పురుగు వల్ల పంటలకు చాలా నష్టం జరుగుతుంది. ఎరుపు రంగు శరీరంతో ఈ పురుగులు ఆకుల అడుగు భాగాన గుంపులుగా పెరుగుతూ ఆకుల నుంచి రసాన్ని పీలుస్తాయి. దీని వల్ల ఆకులోని పత్రహరితం తగ్గిపోయి ఆకులపై తెలుపు, పసుపు మచ్చలు ఏర్పడతాయి. ఆకులు పాలిపోయి మొక్కలపై బూడిద చల్లినట్లు కళావిహీనంగా కనిపిస్తాయి. ఎర్రనల్లి నివారణకు లీటరు నీటికి డైకోఫాల్ 5ml లేదా అబామెక్టిన్ 0.5ml కలిపి పిచికారీ చేయాలి.
News December 16, 2025
దేశంలో తగ్గిన నిరుద్యోగ రేటు

నవంబర్ నెలలో దేశ నిరుద్యోగ రేటు గణనీయంగా తగ్గి 4.7 శాతానికి చేరుకుంది. అక్టోబర్లో ఇది 5.2%గా ఉండగా తాజా గణాంకాల్లో 8 నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (PLFS) ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగ రేటు 3.9 శాతానికి, పట్టణాల్లో 6.5 శాతానికి తగ్గింది. గ్రామాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడటం, మహిళల భాగస్వామ్యం పెరగడం ఈ తగ్గుదలకు ప్రధాన కారణాలని అధికారులు తెలిపారు.
News December 16, 2025
దేశంలోనే తొలి AAD ఎడ్యుసిటీ.. ప్రారంభించనున్న లోకేశ్

AP: దేశంలోనే తొలి ఏవియేషన్, ఏరోస్పేస్, డిఫెన్స్(AAD) ఎడ్యుకేషన్ సిటీ విజయనగరం జిల్లా భోగాపురంలో ఏర్పాటు కానుంది. ఆయా రంగాల్లో వేలాది మంది నిపుణులను తయారుచేసేందుకు 160 ఎకరాల్లో జీఎంఆర్-మాన్సాస్ దీన్ని నిర్మించనున్నాయి. ఈ ప్రాజెక్టును మంత్రి లోకేశ్ ఇవాళ విశాఖలోని రాడిసన్ బ్లూ రిసార్టులో ప్రారంభించనున్నారు. ఈ కేంద్రంలో అంతర్జాతీయంగా పేరొందిన యూనివర్సిటీల బ్రాంచ్ క్యాంపస్లు ఏర్పాటు కానున్నాయి.


