News April 22, 2025
ఉపాధి హామీ పని దినాలు తగ్గించిన కేంద్రం

TG: కేంద్రం 2025-26 ఆర్థిక సంవత్సరానికి పనిదినాలకు తగ్గించింది. గత ఏడాది రాష్ట్రానికి 8 కోట్ల వర్క్ డేస్ కేటాయించగా ఈ సారి 6.5 కోట్లకే పరిమితం చేసింది. మరోవైపు ఉపాధి హామీ పథకం కోసం రూ.2,708.3 కోట్లు కేంద్రం మంజూరు చేసింది. వీటిలో రూ.1,625 కోట్లు వేతనాలు, రూ.1,083 కోట్లు మెటీరియల్ కోసం కేటాయించనున్నారు. కాగా పనిదినాలు పెంచాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం కోరనున్నట్లు తెలుస్తోంది.
Similar News
News April 22, 2025
అరెస్టుల్లో వేగం పెంచిన కూటమి ప్రభుత్వం

AP: అరెస్టుల వ్యవహారంలో కూటమి ప్రభుత్వం స్పీడ్ పెంచింది. తాజాగా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ PSR ఆంజనేయులును అరెస్టు చేసింది. గత ప్రభుత్వంలో ఈయన ఇంటెలిజెన్స్ చీఫ్‌గా పని చేశారు. ముంబై నటి జెత్వానీ వేధింపుల కేసులో ఆంజనేయులుపై పలు అభియోగాలు ఉన్నాయి. మరోవైపు మద్యం కేసులో రాజ్ కసిరెడ్డిని సిట్ పోలీసులు నిన్న అరెస్టు చేశారు. ఇక డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుపై కేసు రీఓపెన్ చేశారు.
News April 22, 2025
ఒకేసారి ఆరుగురు పిల్లలకు పెళ్లి చేశారు!

పిల్లల పెళ్లి విషయంలో సమయాన్ని, డబ్బును ఆదా చేసేందుకు ఇద్దరు అన్నదమ్ములు వినూత్నంగా ఆలోచించారు. తమకున్న ఆరుగురు పిల్లలకు ఒకేసారి పెళ్లి చేసి అందరి దృష్టినీ ఆకర్షించారు. ఈ ఘటన హరియాణాలోని హిసార్ జిల్లా గవాద్ గ్రామంలో జరిగింది. ఇద్దరు కుమారులది ఈనెల 18న, నలుగురు కుమార్తెల వివాహం 19న చేశారు. సామాన్యులంతా ఇలాగే చేసి సమాజానికి మంచి సందేశం ఇవ్వాలని ఆ ఊరి వారంటున్నారు.
News April 22, 2025
సరికొత్త రికార్డు నెలకొల్పిన గిల్-సుదర్శన్

గుజరాత్ టైటాన్స్ ఓపెనింగ్ పెయిర్ గిల్-సాయి సుదర్శన్ సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ మెగా టోర్నీలో 6సెంచరీ భాగస్వామ్యాలు నెలకొల్పిన భారత జోడీగా నిలిచింది. వీరిద్దరూ సీజన్‌లోనే రెండుసార్లు సెంచరీ పార్ట్‌నర్‌షిప్స్ అందించారు. అంతకుముందు రాహుల్-మయాంక్, గంభీర్-ఉతప్ప 5సార్లు సెంచరీ పార్ట్‌నర్‌షిప్ నమోదు చేశారు. ఓవరాల్‌గా కోహ్లీ-డివిలియర్స్(10) అత్యధిక సార్లు సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా ఉంది.