News April 7, 2025
‘అమరావతి’కి రూ.4,200 కోట్లు విడుదల చేసిన కేంద్రం

AP: రాజధాని అమరావతి అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం రూ.4,200 కోట్లు విడుదల చేసింది. ఇటీవల ప్రపంచ బ్యాంకు నుంచి తొలి విడత రుణం కింద రూ.3,535 కోట్లు వచ్చాయి. వీటికి కేంద్ర నిధులు కూడా తోడవ్వడంతో రాజధాని పనులు ఊపందుకోనున్నాయి. గత నెల దాదాపు 70 పనులకు సంబంధించి రూ.40వేల కోట్ల విలువైన నిర్మాణ పనులకు సీఆర్డీఏ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.
Similar News
News April 10, 2025
ట్రేడ్ వార్.. భయం లేదంటున్న చైనా

తమ దేశ ఉత్పత్తులపై అమెరికా 125% టారిఫ్ విధించడంపై చైనా స్పందించింది. యూఎస్ కవ్వింపు చర్యలకు తాము భయపడబోమని స్పష్టం చేసింది. ట్రంప్ తీసుకుంటున్న చర్యలు ప్రపంచానికి వ్యతిరేకంగా ఉంటున్నాయని, ఇది ప్రపంచ వాణిజ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుందని పేర్కొంది. అలాగే చైనాలో ప్రదర్శించే యూఎస్ సినిమాల సంఖ్యను తగ్గించనున్నట్లు చైనా ఫిల్మ్ అడ్మినిస్ట్రేషన్ వెల్లడించింది.
News April 10, 2025
రేపు ఓటీటీలోకి ‘ఛావా’ మూవీ

విక్కీ కౌశల్, రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఛావా’ మూవీ రేపటి నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉండే అవకాశం ఉంది. శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా దాదాపు రూ.800 కోట్లు వసూలు చేసిన విషయం తెలిసిందే.
News April 10, 2025
కంచ భూముల వ్యవహారం.. కమిటీకి ప్రభుత్వం నివేదిక

TG: కంచ గచ్చిబౌలి భూముల <<16050278>>పరిశీలనకు<<>> వచ్చిన సెంట్రల్ ఎంపవర్డ్ కమిటీతో రాష్ట్ర ప్రభుత్వ అధికారుల భేటీ ముగిసింది. ఆ భూములు తమవేనని చెబుతున్న సర్కార్ అందుకు సంబంధించిన నివేదికను కమిటీకి అందించింది. దాన్ని పరిశీలించిన తర్వాత కమిటీ సభ్యులు సుప్రీంకోర్టుకు రిపోర్ట్ సమర్పించనున్నారు.