News December 31, 2024

పేదలకు కేంద్రం న్యూఇయర్ కానుక!

image

కొత్త ఏడాదిలో దేశంలోని పేదలకు 2 కోట్లకు పైగా ఇళ్లు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. రాబోయే మూడు నెలల్లో దీనికి సంబంధించిన సర్వేను పూర్తి చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. 2024 ఎన్నికల హామీలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ విషయమై రాష్ట్రాలకు కేంద్రం సమాచారమిచ్చింది. మార్చి 31లోగా అర్హులను గుర్తించాలని ఆయా ప్రభుత్వాలను ఆదేశించింది.

Similar News

News November 13, 2025

WTCలో 12 జట్లు!

image

వచ్చే సీజన్ నుంచి WTC(వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్)లో 12 జట్లు ఆడనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 9 జట్లు ఆడుతుండగా 2027-29 సీజన్‌కు 12‌కు పెంచే యోచనలో ICC ఉన్నట్లు సమాచారం. 2టైర్ సిస్టమ్‌ను రద్దు చేసి ఆఫ్గానిస్థాన్, జింబాబ్వే, ఐర్లాండ్‌ను జాబితాలో చేర్చనున్నట్లు ESPN కథనం తెలిపింది. దీంతో ప్రతి జట్టుకు టెస్ట్ క్రికెట్ ఆడే అవకాశం కల్పించాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నట్లు పేర్కొంది.

News November 13, 2025

ఎప్‌స్టీన్ ఇంట్లో ట్రంప్ గంటలు గడిపాడు: డెమోక్రాట్లు

image

లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌ ఇంట్లో డొనాల్డ్ ట్రంప్ గంటలకొద్ది సమయం వెచ్చించాడని డెమోక్రాట్లు ఈమెయిల్స్‌ను రిలీజ్ చేశారు. ఆయనకు బాలికల లైంగిక వేధింపుల గురించి ముందే తెలుసని ఆరోపించారు. అయితే ఇది డెమోక్రాట్లు పన్నిన ఉచ్చు అని ట్రంప్ ఖండించారు. వారి మోసాలను, వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ఇలా చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రజలను తప్పుదారి పట్టించేందుకు డెమోక్రాట్లు ఏమైనా చేస్తారని ఫైరయ్యారు.

News November 13, 2025

ఢిల్లీ ఘటన ‘గ్యాస్ సిలిండర్ పేలుడు’: పాక్ మంత్రి

image

ఢిల్లీ <<18270750>>పేలుడు<<>>పై పాక్ మంత్రి ఖవాజా ఆసిఫ్ కుటిల వ్యాఖ్యలు చేశారు. ‘నిన్నటి వరకు అది గ్యాస్ సిలిండర్ పేలుడు.. ఇప్పుడు విదేశీ కుట్ర దాగి ఉందని భారత్ చెబుతోంది’ అని అన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం ఈ ఘటనను భారత్ వాడుకుంటుందని ఓ టీవీ షోలో సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో తమపై ఆరోపణలు చేసినా ఆశ్చర్యపోనని అన్నారు. తమ వరకు వస్తే ఊరికే ఉండబోమని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు.