News November 4, 2024

కెనడాలో భారతీయుల భ‌ద్ర‌త‌పై కేంద్రం ఆందోళ‌న‌

image

కెనడాలో భార‌త పౌరుల భ‌ద్ర‌త‌పై కేంద్రం ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. బ్రాంప్ట‌న్‌లోని హిందూ స‌భ ఆలయంపై వేర్పాటువాదుల హింసాత్మ‌క చ‌ర్య‌ల‌ను తీవ్రంగా ఖండించింది. ఈ తరహా దాడుల నుంచి ప్రార్థ‌నా స్థ‌లాల ప‌రిర‌క్ష‌ణ‌కు కెన‌డా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరింది. దాడుల‌కు పాల్ప‌డిన వారిపై విచార‌ణ జ‌రుగుతుంద‌ని ఆశిస్తున్నామంది. పౌరులకు తమ కాన్సులర్లు చేస్తున్న సాయాన్ని ఈ దాడులు ఆపలేవని పేర్కొంది.

Similar News

News December 13, 2025

చలికాలం.. కోళ్ల దాణా నిల్వలో జాగ్రత్తలు

image

కోళ్లకు మంచి దాణా అందించినప్పుడే వాటి పెరుగుదల బాగుంటుంది. అయితే దాణా నిల్వలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వెటర్నరీ అధికారులు సూచిస్తున్నారు. దాణా బస్తాలను నేలపై కాకుండా చెక్క పలకల మీద ఉంచాలి. గోడలకు తగలకుండా చూడాలి. తేమగా ఉన్న దాణాను నిల్వ చేయకూడదు. 2-3వారాలకు మించి దాణా నిల్వ ఉంచకూడదు. వేడి దాణా చల్లబడిన తర్వాత మాత్రమే గోదాముల్లో నిల్వ ఉంచాలి. లేదంటే బస్తాలపై తేమ ఏర్పడి బూజు పడుతుంది.

News December 13, 2025

హైదరాబాద్‌లో మెస్సీ షెడ్యూల్ ఇలా..

image

* రాత్రి.7.30 గంటలకు ఉప్పల్ స్టేడియానికి మెస్సీ, రాహుల్ గాంధీ, CM రేవంత్
* 7.55 గంటలకు మ్యాచ్ కిక్ ఆఫ్
* 8.06 గంటలకు గ్రౌండ్‌లోకి మెస్సీ, రేవంత్
* 8.33 గంటలకు పెనాల్టీ షూటౌట్
* 8.53 గంటలకు మెస్సీ చేతులమీదుగా విజేతకు ‘GOAT’ కప్ ప్రదానం
* 8.54 గంటలకు మెస్సీని సత్కరించనున్న సీఎం
* 8.57 గంటలకు కార్యక్రమం ముగింపు

News December 13, 2025

ఇండియాకు కోహ్లీ.. మెస్సీని కలవడానికేనా?

image

స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఇండియాకు చేరుకున్నారు. తన భార్య అనుష్క శర్మతో కలిసి ముంబై ఎయిర్‌పోర్టులో కనిపించారు. ‘గోట్ టూర్’లో భాగంగా భారత్‌లో ఉన్న మెస్సీని కోహ్లీ కలుస్తారని ప్రచారం జరుగుతోంది. రేపు ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఫ్యాన్స్‌ను మెస్సీ కలవనున్నారు. ఈ సమయంలోనే ఇద్దరు దిగ్గజాలు మీట్ అవుతారని అభిమానులు భావిస్తున్నారు. సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ తర్వాత కోహ్లీ <<18500552>>లండన్‌<<>>కు వెళ్లడం తెలిసిందే.