News April 5, 2025
సన్నబియ్యం కేంద్రానివే: కిషన్ రెడ్డి

TG: రేషన్ కార్డుదారులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సన్నబియ్యంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘6KGల బియ్యంలో 5KGలు PM గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. ఇందుకోసం కిలో బియ్యానికి రూ.37.52ల చొప్పున సబ్సిడీ ఇస్తోంది. అంటే ఐదుగురున్న కుటుంబానికి నెలకు రూ.938ల సబ్సిడీని అందిస్తోంది. ఈ పథకం కింద 2కోట్ల మందికి లబ్ధి చేకూరుతుంది’ అని Xలో రాసుకొచ్చారు.
Similar News
News April 13, 2025
ఓటీటీలోకి వచ్చేసిన ‘కింగ్స్టన్’

మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ హీరోగా తెరకెక్కిన అడ్వెంచర్ హారర్ థ్రిల్లర్ ‘కింగ్స్టన్’ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. తెలుగు, తమిళ భాషల్లో జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రానికి కమల్ ప్రకాశ్ దర్శకత్వం వహించగా, దివ్యభారతి హీరోయిన్గా నటించారు. మార్చి 7న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విఫలమైనా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
News April 13, 2025
రేపు సెలవు

భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా రేపు తెలుగు రాష్ట్రాల్లోని విద్యాసంస్థలకు సెలవు ఉండనుంది. 14న పబ్లిక్ హాలిడేగా పేర్కొంటూ ఏపీ, తెలంగాణ విద్యాశాఖలు క్యాలెండర్లో పొందుపర్చాయి. ఇప్పటికే ఆదివారం హాలిడేస్ రావడంతో సోమవారం కూడా విద్యార్థులకు కలిసొచ్చినట్లయింది. అటు దేశవ్యాప్తంగా బ్యాంకులతోపాటు స్టాక్ మార్కెట్లకు కూడా రేపు సెలవు ఉండనుంది.
News April 13, 2025
జలియన్ వాలాబాగ్.. స్వాతంత్ర్య పోరాటంలో మలుపు: మోదీ

జలియన్ వాలాబాగ్ అమరవీరులకు PM మోదీ నివాళులర్పించారు. ఈ ఘటన తర్వాత భారత స్వాతంత్ర్య పోరాటమే మలుపు తిరిగిందని ట్వీట్ చేశారు. అమరవీరుల అజేయ స్ఫూర్తిని రాబోయే తరాలు గుర్తుంచుకోవాలన్నారు. పంజాబ్లోని అమృత్సర్లో 1919 APR 13న రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా శాంతియుత నిరసన తెలుపుతున్న వారిపై బ్రిటిష్ జనరల్ డయ్యర్ కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 1,500 మంది ప్రాణాలు కోల్పోయారు. 1000 మంది గాయపడ్డారు.