News August 12, 2024
అందుకు కేంద్రాన్ని మెచ్చుకోవాల్సిందే: థరూర్

బంగ్లాదేశ్ PM పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనాకు భారత ప్రభుత్వం ఆశ్రయం ఇవ్వడాన్ని కాంగ్రెస్ MP శశి థరూర్ ప్రశంసించారు. భారత్ 1971లోనూ బంగ్లాదేశ్ ప్రజలతో ఉందని, ఎప్పటికీ ఉంటుందని స్పష్టం చేశారు. ‘హసీనాకు మనం సాయం చేసి ఉండకపోతే అది దేశానికి అవమానకరంగా మారేది. మనతో ఎవరూ స్నేహం చేయాలనుకునేవారు కాదు’ అని థరూర్ అన్నారు. బంగ్లాలో ప్రస్తుత పరిస్థితులు ఇరుదేశాల బంధంపై ప్రభావం చూపలేవని అభిప్రాయపడ్డారు.
Similar News
News November 27, 2025
ధాన్యం కొనుగోళ్లలో జాప్యం వద్దు: చంద్రబాబు

AP: పంటలన్నింటికీ గిట్టుబాటు ధరలు దక్కేలా చూడాలని వ్యవసాయ, పౌర సరఫరాల శాఖల సమీక్షలో సీఎం చంద్రబాబు అన్నారు. పత్తి, అరటి, జొన్న వంటి పంటలు సాగు చేసే రైతులకు ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లలో జాప్యం జరగకూడదని, 2 రోజుల్లో చెల్లింపులు చేయాలన్నారు. వర్షాలు ఉంటాయనే హెచ్చరికల నేపథ్యంలో రైతులకు గోనె సంచులు అందించాలని ఆదేశాలు జారీ చేశారు.
News November 27, 2025
విమానం ఆలస్యం.. సిరాజ్ ఆగ్రహం

గువాహటి నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన ఎయిరిండియా విమానం ఆలస్యం కావడంపై టీమ్ఇండియా స్టార్ బౌలర్ మహ్మద్ సిరాజ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం రాత్రి 7.25 బయల్దేరాల్సిన ఫ్లైట్ 4 గంటలకు పైగా ఆలస్యం అయిందన్నారు. విమానం ఎప్పుడు బయల్దేరుతుందో ఎయిర్లైన్స్ అప్డేట్ ఇవ్వలేదని, ఆలస్యానికి కారణం కూడా చెప్పలేదని ఆయన మండిపడ్డారు. తనకిది వరస్ట్ ఎక్స్పీరియన్స్ అని అసహనం వ్యక్తం చేశారు.
News November 27, 2025
నవంబర్ 27: చరిత్రలో ఈ రోజు

1888: లోక్సభ మొదటి స్పీకర్ జి.వి.మావలాంకర్ జననం
1940: మార్షల్ ఆర్ట్స్ యోధుడు బ్రూస్ లీ జననం
1953: హిందీ సంగీత దర్శకుడు బప్పీలహరి జననం
1975: నటి, మోడల్, రచయిత్రి సుచిత్రా కృష్ణమూర్తి జననం
1975: రేలంగి వెంకట్రామయ్య మరణం
1986: మాజీ క్రికెటర్ సురేశ్ రైనా జననం(ఫొటోలో)
2008: భారత మాజీ ప్రధాని విశ్వనాథ ప్రతాప్ సింగ్ మరణం


