News October 4, 2024

కేంద్రం ఇప్పటికీ ఆ నిధులు ఇవ్వలేదు: సీఎం పినరయి

image

వయనాడ్ జిల్లాలో కొండచ‌రియ‌లు విరిగిప‌డిన ఘ‌ట‌న‌లో పున‌రావాసం కోసం కేంద్రం ఇప్పటి వరకు ఎలాంటి సాయం అందించలేదని CM పిన‌ర‌యి విజ‌య‌న్ తెలిపారు. ఈ ప్రాంతంలో PM మోదీ త‌న ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా నిధుల కొర‌త ఉండ‌ద‌ని చెప్పార‌న్నారు. అయితే, ఈ ఏడాది రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధికి కేంద్ర కేటాయింపుల‌తో పాటు అత్యవసర సహాయం ₹219 కోట్లు కోరినట్టు తెలిపారు. మరోసారి ఆర్థిక సాయానికి విజ్ఞప్తి చేస్తామ‌న్నారు.

Similar News

News October 7, 2024

రేపు కోర్టుకు హీరో నాగార్జున

image

TG: మంత్రి కొండా సురేఖపై హీరో నాగార్జున వేసిన పరువు నష్టం దావాపై నాంపల్లి స్పెషల్ కోర్టులో విచారణ జరిగింది. తన స్టేట్‌మెంట్ తెలిపేందుకు రేపు కోర్టుకు రావాలని న్యాయస్థానం నాగార్జునను ఆదేశించింది. ఈమేరకు విచారణను రేపటికి వాయిదా వేసింది.

News October 7, 2024

‘మహారాజ’ దర్శకుడికి ఖరీదైన గిఫ్ట్

image

విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటించిన ‘మహారాజ’ చిత్రం 100 డేస్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా డైరెక్టర్ నిథిలన్ స్వామినాథన్‌‌కు నిర్మాతలు సర్‌ఫ్రైజ్ ఇచ్చారు. ఖరీదైన BMW కారును హీరో చేతుల మీదుగా అందించారు. ఈ మూవీ ₹110 కోట్లకుపైగా కలెక్షన్లను సాధించిన విషయం తెలిసిందే. నెట్‌ఫ్లిక్స్ వ్యూస్‌లోనూ అదరగొట్టింది. ఈ సినిమాలో అనురాగ్ కశ్యప్, మమతా మోహన్‌దాస్, అభిరామి, నటరాజన్ కీలక పాత్రలు పోషించారు.

News October 7, 2024

ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన రతన్ టాటా

image

బీపీ తగ్గడంతో తాను తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరానని వస్తోన్న వార్తలను ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా ఖండించారు. వృద్ధాప్యం దృష్ట్యా తాను జనరల్ చెకప్ కోసం మాత్రమే ఆస్పత్రికి వెళ్లినట్లు ప్రకటించారు. ప్రస్తుతం తాను క్షేమంగానే ఉన్నానని, ఇలాంటి ప్రచారాలను నమ్మొద్దని కోరారు.