News November 19, 2024

ఆ బ్యాంకుల్లో వాటాలు విక్రయించనున్న కేంద్రం?

image

ప్ర‌భుత్వ రంగ బ్యాంకులైన CBI, IOB, యూకో బ్యాంక్‌, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకుల్లో వాటాలు విక్ర‌యించాల‌ని కేంద్రం యోచిస్తోంది! దీనికి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ చ‌ర్య‌లు ప్రారంభించింది. కేంద్ర కేబినెట్ ఆమోదానికి త్వ‌ర‌లో ప్ర‌తిపాద‌న‌లు పంప‌నుంది. OFS సేల్ కింద వాటాలు విక్ర‌యించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. కంపెనీ షేర్లలో పబ్లిక్ పర్సంటేజ్ నిబంధనల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.

Similar News

News January 30, 2026

3 భాషల్లో ‘ధురంధర్’ స్ట్రీమింగ్

image

సూపర్ హిట్ మూవీ ‘ధురంధర్’ Netflixలో అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో హిందీలో మాత్రమే రిలీజైన ఈ మూవీ OTTలో తెలుగు, తమిళ భాషల్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది. థియేట్రికల్ వెర్షన్ రన్ టైమ్ 3.34hrs ఉండగా OTTలో 3.25hrsకి తగ్గించారు. 2025 DEC 5న విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ₹1350Cr+ వసూలు చేసింది. ఇందులో రణ్‌వీర్ సింగ్ సీక్రెట్ ఏజెంట్‌గా నటించారు. INDలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన హిందీ సినిమా ఇదే.

News January 30, 2026

NH ప్రాజెక్టులు 2029 నాటికి పూర్తి చేయాలి: CM

image

AP: ₹1.40 లక్షల కోట్ల విలువైన NH ప్రాజెక్టులను 2029 నాటికి పూర్తి చేయాలని అధికారులను CM CBN ఆదేశించారు. ‘ఓడరేవులు, ముఖ్యమైన ప్రాంతాలను లింక్ చేస్తూ రోడ్లు నిర్మించాలి. పురోగతిలో ఉన్న ₹42,194Cr పనులను 2027 DEC నాటికి పూర్తి చేయాలి. రాజధానిని అనుసంధానించే BLR-కడప-VJA ఎకనామిక్ కారిడార్ పనులు 2027కల్లా పూర్తి కావాలి. ఖరగ్‌పూర్-అమరావతి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్‌వే DPRలు సిద్ధం చేయాలి’ అని ఆదేశించారు.

News January 30, 2026

సూపర్ సెంచరీ.. 49 బంతుల్లో 115 రన్స్

image

సెంచూరియన్‌లో వెస్టిండీస్‌తో జరిగిన రెండో టీ20లో సౌతాఫ్రికా ఓపెనర్ క్వింటన్ డికాక్ 43 బంతుల్లోనే సెంచరీ చేశారు. 10 సిక్సులు, 6 ఫోర్లతో బౌలర్లపై విరుచుకుపడ్డారు. డికాక్ (49 బంతుల్లో 115), రికెల్టన్ (36 బంతుల్లో 77*) ఆకాశమే హద్దుగా చెలరేగడంతో WI నిర్దేశించిన 222 పరుగుల లక్ష్యాన్ని SA 17.3 ఓవర్లలోనే ఛేదించింది. WI బ్యాటర్లలో హెట్‌మయర్ (42 బంతుల్లో 75), రూథర్ ఫర్డ్ (24 బంతుల్లో 57) రాణించారు.