News January 7, 2025

స్టీల్‌ప్లాంట్‌ను కేంద్రం ఆదుకుంటుంది: పురందీశ్వరి

image

AP: రేపు PM మోదీ వైజాగ్‌లో పర్యటించనున్న నేపథ్యంలో ఆ ఏర్పాట్లను రాష్ట్ర BJP చీఫ్ పురందీశ్వరి పరిశీలించారు. స్టీల్ ప్లాంట్‌ను గాడిలో పెట్టాలని కేంద్రం భావిస్తోందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ‘కూటమి సర్కారు ఏర్పడ్డాక తొలిసారిగా PM విశాఖకు వస్తున్నారు. అనేక అభివృద్ధి కార్యక్రమాల్ని ప్రారంభిస్తారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం మంచి ప్యాకేజీ ఇవ్వాలని కేంద్రం భావిస్తోంది’ అని వెల్లడించారు.

Similar News

News January 12, 2025

బాధితులకు టీటీడీ చెక్కుల పంపిణీ

image

AP: తిరుపతి తొక్కిసలాట మృతుల కుటుంబాలకు టీటీడీ నష్టపరిహారం అందజేసింది. ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన 4 కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేసింది. లావణ్య, రజనీ, శాంతి కుటుంబసభ్యులకు రూ.25 లక్షలు అందించింది. అలాగే మృతుల కుటుంబాల్లో ఒకరికి టీటీడీలో కాంట్రాక్టు ఉద్యోగం కల్పించనుంది. మృతుల పిల్లలకు ఉచిత విద్య అందించనుంది.

News January 12, 2025

లాస్ ఏంజెలిస్ కార్చిచ్చులో బాలీవుడ్ నటి

image

లాస్ ఏంజెలిస్‌లో ఏర్పడిన కార్చిచ్చులో బాలీవుడ్ స్టార్ నటి ప్రీతి జింటా చిక్కుకున్నారు. అక్కడి పరిస్థితులను వివరిస్తూ ఆమె ట్వీట్ చేశారు. ‘చుట్టూ జరుగుతోన్న విధ్వంసం చూసి భయాందోళనకు గురయ్యాం. చిన్న పిల్లలు, వృద్ధులతో చాలా మంది పొరుగువారు ఇళ్లను వదిలి వెళ్లిపోయారు. ఇవన్నీ చూసి నేను హృదయవిదారకంగా ఉన్నా. మమ్మల్ని సురక్షితంగా ఉంచినందుకు దేవుడికి & అగ్నిమాపక సిబ్బందికి కృతజ్ఞతలు’ అని ట్వీట్ చేశారు.

News January 12, 2025

కేటీఆర్‌ను నేనేం పొగడలేదు: దానం

image

TG: <<15124836>>తాను కేటీఆర్‌ను పొగిడానంటూ<<>> వచ్చిన వార్తలపై దానం నాగేందర్ స్పందించారు. ‘హైదరాబాద్ ఇమేజ్‌ను చంద్రబాబు, వైఎస్ పెంచారు. బీఆర్ఎస్, కేటీఆర్ నగరానికి చేసిందేం లేదు. హైడ్రా విషయంలో నా మాట మీదే ఉన్నా. దాని వల్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. ఆ విషయంలో ప్రభుత్వం పునరాలోచించాలి. ఫార్ములా-ఈ కారు రేసుతో హైదరాబాద్ ఇమేజ్ పెరిగింది. అలా అని నేను కేటీఆర్‌కు క్లీన్ సర్టిఫికెటేం ఇవ్వడం లేదు’ అని తెలిపారు.