News September 3, 2025
కేంద్ర ప్రభుత్వానికి ముందు చూపు లేదు: మంత్రి తుమ్మల

కేంద్రానికి ముందు చూపు లేకపోవడంతోనే దేశంలో యూరియా కొరత ఏర్పడిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ‘చైనా నుంచి రావాల్సిన యూరియా రాకపోవడం, దేశీయంగా ఉత్పత్తి పెంచకపోవడం వల్ల కొరత వచ్చింది. రాష్ట్రంలో బ్లాక్ మార్కెట్‌కి ఆస్కారం లేదు. రామగుండంలో 4 నెలలుగా ఉత్పత్తి నిలిచిపోయింది’ అని వివరించారు. ఇటీవల వర్షాలు, వరదల వల్ల 2.5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని, సాయం చేయాలని కేంద్రాన్ని కోరతామన్నారు.
Similar News
News September 5, 2025
యూనివర్సల్ హెల్త్ పాలసీ పూర్తి వివరాలు!

AP: రాష్ట్ర ప్రజలకు ఆయుష్మాన్ భారత్- NTR వైద్య సేవ కింద <<17610266>>హెల్త్ పాలసీ<<>> ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ పాలసీ కింద..
* EHS వర్తించేవారికి కాకుండా మిగతావారికి వైద్యసేవలు
* జర్నలిస్టుల కుటుంబాలకూ వర్తింపు
* తొలుత ఆస్పత్రి ఖర్చులు బీమా కంపెనీలు చెల్లించనుండగా, ఆపై ప్రభుత్వం వాటికి అందిస్తుంది.
* ఖర్చులను 15రోజుల్లోగా చెల్లించాలని నిర్ణయం
* RFP విధానంలో రోగి చేరిన 6గంటల్లో అప్రూవల్.
News September 5, 2025
ఒక్క ఇంటి కరెంట్ బిల్లు రూ.1.61కోట్లు.. చివరికి

తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లా మారుతకుళంలో మరియప్పన్ అనే వ్యక్తికి ఏకంగా రూ.1,61,31,281 కరెంట్ బిల్ వచ్చింది. ఇది చూసిన మరియప్పన్ కుటుంబం షాక్‌కి గురైంది. వెంటనే TNPDCL అధికారులకు ఫిర్యాదు చేసింది. ఇది సాంకేతిక లోపంతో పాటు మానవ తప్పిదం వల్ల జరిగిందని అధికారులు వెల్లడించారు. తప్పిదాన్ని సవరించగా వారి బిల్లు రూ.1.61కోట్ల నుంచి రూ.494కు చేరింది.
News September 5, 2025
సెప్టెంబర్ 5: చరిత్రలో ఈ రోజు

1884: ఆంధ్ర విశ్వకర్మ వంశీయుడు కె.గోపాలకృష్ణమాచార్యులు జననం
1888: భారత తొలి ఉపరాష్ట్రపతి, రెండవ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జననం(ఫొటోలో)
1955: తెలంగాణ ఉద్యమ నాయకుడు ఎం.కోదండరాం జననం
1995: తెలుగు హాస్య నటి గిరిజ మరణం
1997: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మదర్ థెరీసా మరణం
* జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం