News September 4, 2024
రేపు రాష్ట్రంలో కేంద్ర బృందం పర్యటన

AP: రేపు రాష్ట్రంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించనుంది. వరదలతో అతలాకుతలమైన కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో పర్యటించి నష్టం అంచనా వేయనుంది. కాగా వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని సీఎం చంద్రబాబు ఇప్పటికే కేంద్రాన్ని కోరారు. దీనిపై కేంద్రం ఇంకా స్పందించలేదు.
Similar News
News October 19, 2025
CBN విషయంలో తప్పని రియలైజ్ అయ్యాను: జోగి రమేష్

AP: గతంలో అసెంబ్లీ చంద్రబాబు బాధపడిన విషయంలో తాము తప్పు చేశామని తన భార్య చెప్పిందని మాజీ మంత్రి జోగి రమేష్ అన్నారు. అది తప్పని తర్వాత తానూ రియలైజ్ అయినట్లు తెలిపారు. తమ మధ్య రాజకీయ వైరమే ఉందని, ఇతర విషయాల్లో అందరిని గౌరవిస్తానని పేర్కొన్నారు. పార్టీ మారబోనని, YSR బ్రాండ్‌తో జగన్ వెంట కొనసాగుతానని తెలిపారు. నకిలీ మద్యం <<18043835>>కేసులో<<>> చంద్రబాబు తనపై కక్ష కట్టారని ఆరోపించారు.
News October 19, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 19, ఆదివారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.58 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.10 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.01 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.15 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.52 గంటలకు
✒ ఇష: రాత్రి 7.04 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News October 19, 2025
Dhanteras: 50 వేల కార్లు డెలివరీ చేస్తున్న మారుతి సుజుకీ!

ధన్‌తేరాస్ సందర్భంగా రికార్డు స్థాయిలో 50 వేల కార్లను డెలివరీ చేస్తున్నట్లు మారుతి సుజుకీ తెలిపింది. శనివారం 41 వేల కార్లను కస్టమర్లకు అందజేశామని చెప్పింది. ఆదివారం మరో 10 వేలు డెలివరీ చేస్తామని, తద్వారా 51 వేల కార్ల రికార్డును అందుకునేందుకు ప్రయత్నిస్తామని సంస్థ SEO పార్థో బెనర్జీ తెలిపారు. కాగా ఈ ఏడాది ధన్‌తేరాస్ శనివారం మధ్యాహ్నం 12.18కి ప్రారంభమై, ఇవాళ మధ్యాహ్నం 1.51గం. దాకా కొనసాగనుంది.