News February 6, 2025
ఉపాధి కూలీలకు ₹6,434 కోట్లు బకాయి పడిన కేంద్రం
MGNREGA పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా ఉపాధి కూలీలకు కేంద్రం చెల్లించాల్సిన వేతనాలు బకాయిలు రూ.6,434 కోట్ల వరకూ ఉన్నాయి. గ్రామీణాభివృద్ధి శాఖ సహాయమంత్రి కమలేశ్ ఈ విషయాన్ని లోక్‌సభలో వెల్లడించారు. అత్యధికంగా తమిళనాడుకు రూ.1652 కోట్లు, UPకి రూ.1214 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇక 2022-23 కాలంలో దేశవ్యాప్తంగా 86.17 లక్షలమంది, 2023-24లో 68.86 లక్షలమంది కూలీలను తొలగించినట్లు వెల్లడించారు.
Similar News
News February 6, 2025
సమాజంలో కుల విషం చిమ్ముతున్న కాంగ్రెస్: మోదీ
అవినీతి, కుటుంబమే కాంగ్రెస్ ప్రభుత్వ మోడల్ అని PM మోదీ విమర్శించారు. మైనారిటీలను బుజ్జగించడమే వారికి తెలుసన్నారు. ప్రస్తుతం వారు సమాజంలో విభజన, ఆందోళన, కుల విషాన్ని వ్యాపింపజేస్తున్నారని ఆరోపించారు. కొందర్ని బుజ్జగించేందుకే కాంగ్రెస్ OBC ప్యానెల్‌ను అడ్డుకుందన్నారు. తమది ప్రత్యామ్నాయ ప్రభుత్వ మోడలని, తాము అందరి వికాసాన్ని కోరుకుంటామని తెలిపారు. ప్రజలు తమను మూడోసారి ఎన్నుకున్నారని గుర్తుచేశారు.
News February 6, 2025
కాంగ్రెస్ నుంచి సబ్కా వికాస్‌ను ఆశించడం కష్టమే: మోదీ
పార్లమెంటులో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రసంగం తమలో స్ఫూర్తి నింపిందని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. రాజ్యసభలో ధన్యవాద తీర్మానంపై ప్రసంగిస్తూ కాంగ్రెస్‌పై విమర్శల బాణాలు ఎక్కుపెట్టారు. వారికి సబ్ కా సాత్ సబ్ కా వికాస్ ఎందుకు అర్థమవ్వడం లేదో తెలియదన్నారు. వాళ్ల నుంచి సబ్కా వికాస్ ఆశించడం కష్టమేనన్నారు. వారికి కుటుంబమే ప్రధానమని, వారికి తెలిసిందల్లా బుజ్జగింపు రాజకీయాలని ఎద్దేవా చేశారు.
News February 6, 2025
FLIPKARTపై నెటిజన్లు ఫైర్.. ఎందుకంటే?
ఆన్లైన్ షాపింగ్ సైట్ ‘ఫ్లిప్‌కార్ట్’పై నెట్టింట విమర్శలొస్తున్నాయి. కంపెనీ తాజాగా ‘ప్రొటెక్ట్ ప్రామిస్ ఫీ’ పేరుతో రూ.9 వసూలు చేయడంపై వినియోగదారులు ఫైరవుతున్నారు. ఈ యాప్‌లో ఇప్పటికే ప్లాట్ ఫామ్ ఫీ, హ్యాండ్లింగ్ ఫీ, సెక్యూర్ ప్యాకేజింగ్ ఫీ వసూలు చేస్తుండగా తాజాగా ప్రొటెక్ట్ ప్రామిస్ ఫీ తీసుకొచ్చారని చెబుతున్నారు. కొన్నిరోజులైతే యాప్ ఓపెన్ చేసినందుకు కూడా ఫీజు అడుగుతారేమోనంటూ సెటైర్లు వేస్తున్నారు.