News July 19, 2024

యువతిపై ‘జిందాల్ స్టీల్’ సీఈవో వేధింపులు!

image

జిందాల్ స్టీల్ సీఈవో దినేశ్ కుమార్ తనని వేధించారని ఓ యువతి Xలో సంస్థ ఛైర్మన్ నవీన్ జిందాల్‌కు ఫిర్యాదు చేశారు. ‘కోల్‌కతా నుంచి అబుదాబి వెళ్తుండగా ఫ్లైట్‌లో నా పక్కన దినేశ్ కూర్చున్నారు. మాటలు కలిపి అతని మొబైల్‌లో పోర్న్ వీడియోలు చూపించారు. భయంతో స్టాఫ్‌కి ఫిర్యాదు చేశా. ఎయిర్పోర్ట్ పోలీసుల ముందు ఆయన ఇది అబద్ధమనలేదు’ అని ట్వీట్ చేశారు. నవీన్ స్పందిస్తూ విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Similar News

News January 23, 2025

Stock Markets: నష్టాలకే అవకాశం..

image

స్టాక్‌మార్కెట్లు నేడు నెగటివ్ జోన్లో మొదలయ్యే అవకాశముంది. గిఫ్ట్‌నిఫ్టీ 40pts మేర పతనమవ్వడం దీనినే సూచిస్తోంది. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే అందుతున్నాయి. క్రూడాయిల్, US బాండ్ యీల్డులు, బంగారం ధరలు తగ్గినప్పటికీ డాలర్ ఇండెక్స్ పెరగడం కలవరపెడుతోంది. నిఫ్టీ 23,150 పైస్థాయిలో నిలదొక్కుకోవడం కీలకం. నేడు DR REDDY, HPCL, ADANI ENERGY, ADANI GREEN ENERGY, TEJAS NETWORK ఫలితాలు రానున్నాయి.

News January 23, 2025

గణతంత్ర పరేడ్‌లో ఏపీ శకటం

image

ఢిల్లీ కర్తవ్యపథ్‌లో జరిగే 76వ రిపబ్లిక్ డే పరేడ్‌లో 26 శకటాలను ప్రదర్శించనున్నారు. ఇందులో 16 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు, 10 కేంద్ర ప్రభుత్వ శకటాలు ఉన్నాయి. దక్షిణాది నుంచి AP, KAలకు అవకాశం దక్కగా, TGకు దక్కలేదు. 400 ఏళ్ల చరిత్ర ఉన్న AKP(D) ఏటికొప్పాక బొమ్మల శకటానికి స్థానం దక్కింది. అంకుడు కర్రతో చేతితో తయారు చేసే ఈ బొమ్మలకు 2017లో భౌగోళిక గుర్తింపు దక్కింది. ఇవి పర్యావరణ అనుకూలమైనవి.

News January 23, 2025

వారికి ఖాన్స్ కావాలి.. హిందూ నటులను పట్టించుకోరు: BJP నేత

image

బంగ్లాదేశీయుడు నిజంగానే సైఫ్‌ను కత్తితో పొడిచాడా లేక ఆయన యాక్ట్ చేస్తున్నారా అని MH మంత్రి నితేశ్ రాణె ప్రశ్నించారు. పరిస్థితుల్ని గమనిస్తే డౌట్ వస్తోందన్నారు. ‘చూస్తుంటే షరీఫుల్‌ను సైఫ్ స్వయంగా స్వాగతించినట్టు అనిపిస్తోంది. ఇక ప్రతిపక్షాలకేమో ఖాన్ యాక్టర్స్ తప్ప హిందూ నటులపై జాలి ఉండదు. సుశాంత్‌ గురించి సుప్రియా, జితేందర్ ఎప్పుడైనా అడిగారా? సైఫ్, షారుఖ్ కొడుకునైతే పట్టించుకుంటారు’ అని అన్నారు.