News November 11, 2024
అత్యంత విలువైన కంపెనీకి CEO.. కానీ వాచ్ పెట్టుకోరు!
NVIDIA సంస్థ ప్రపంచంలో అత్యంత విలువైన సంస్థగా ఆవిర్భవించిన సంగతి తెలిసిందే. అలాంటి సంస్థకు CEOగా ఉన్న జెన్సెన్ హువాంగ్ వాచ్ పెట్టుకోరు. అందుకు కారణాన్ని ఆయన తాజాగా వెల్లడించారు. ‘మీరు మా కంపెనీ ఉద్యోగుల్ని అడిగి చూడండి. మాకు దీర్ఘకాలం ప్లాన్స్ ఉండవు. ప్రస్తుతం మీద దృష్టి పెట్టడమే మా అజెండా. భవిష్యత్తు కాదు.. ముందు ఈ క్షణంపై దృష్టి పెట్టాలన్న ఆలోచనతోనే వాచ్ ధరించను’ అని వివరించారు.
Similar News
News November 13, 2024
ప్రభాస్ ‘స్పిరిట్’లోకి పూరీ జగన్నాథ్?
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కనున్న స్పిరిట్ మూవీ గురించి టాలీవుడ్లో ఓ ఇంట్రస్టింగ్ అప్డేట్ చక్కర్లు కొడుతోంది. ఆ సినిమాకు డైలాగ్స్ రాయాలంటూ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ను సందీప్ అడిగారని సమాచారం. అందుకు పూరీ కూడా సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది. పూరీ ప్రభాస్తో తీసిన బుజ్జిగాడు, ఏక్ నిరంజన్ సినిమాల్లో డైలాగ్స్ పాపులర్ అయిన సంగతి తెలిసిందే.
News November 13, 2024
తగ్గిన బంగారం ధరలు
హైదరాబాద్ మార్కెట్లో ఇవాళ బంగారం ధరలు తగ్గాయి. 10 గ్రా. 24 క్యారెట్ల పసిడి ధర రూ.440 తగ్గి రూ.76,850కి చేరింది. 10 గ్రా. 22 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.400 తగ్గి రూ.70,450 పలుకుతోంది. అటు వెండి ధర రూ.1,000 పెరిగి రూ.1,01,000కు చేరింది.
News November 13, 2024
విరాట్, రోహిత్ బ్రేక్ తీసుకోవాలి: బ్రెట్ లీ
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ క్రికెట్ నుంచి బ్రేక్ తీసుకోవాలని ఆస్ట్రేలియా మాజీ బౌలర్ బ్రెట్ లీ అభిప్రాయపడ్డారు. వరుస వైఫల్యాల కారణంగా వారిపై ఒత్తిడి పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘వారి ఫామ్ బాలేదు. జట్టు నుంచి ఇద్దరూ గ్యాప్ తీసుకోవాలి. క్రికెట్ నుంచి దూరంగా గడపాలి. సమస్యను గుర్తించి సరి చేసుకుని మళ్లీ ఫ్రెష్గా మొదలుపెట్టాలి. నేటికీ ఆ ఇద్దరూ అగ్రశ్రేణి బ్యాటర్లే’ అని పేర్కొన్నారు.