News March 11, 2025
ఈ ఐదు దేశాల్లో స్వచ్ఛమైన గాలి

నేటి కాలంలో స్వచ్ఛమైన గాలి దొరకడమూ గగనంగానే మారింది. ఓ అధ్యయనం ప్రకారం ఐస్‌ల్యాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫిన్లాండ్, కెనడా దేశాల్లో అత్యంత స్వచ్ఛమైన గాలి లభిస్తోందని తేలింది. ఈ దేశాల విస్తీర్ణంతో పోలిస్తే జనాభా బాగా తక్కువగా ఉండటంతో కాలుష్యం తక్కువగా ఉంటోందని పరిశోధకులు పేర్కొన్నారు. రణగొణ ధ్వనులు లేని ప్రశాంతమైన జీవితం, పచ్చటి ప్రకృతి, స్వచ్ఛమైన నీరు ఈ దేశాల్లో లభ్యమవుతున్నాయని వివరించారు.
Similar News
News January 27, 2026
కొత్త బ్యాక్ డ్రాప్లో నెక్స్ట్ సినిమా: అనిల్ రావిపూడి

తాను చేయబోయే తర్వాతి సినిమా కొత్త బ్యాక్ డ్రాప్లో ఉంటుందని దర్శకుడు అనిల్ రావిపూడి అన్నారు. తాను ఇంతవరకు తీయని బ్యాక్ డ్రాప్ కావడంతో ఎగ్జైట్మెంట్తో ఉన్నానని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. కథ పూర్తయ్యాక అప్డేట్స్ ఇస్తానని తెలిపారు. సినిమా మేకింగ్‌లో స్క్రిప్ట్ కీలకమని, అందుకే ప్రతి సీన్ విషయంలో జాగ్రత్తగా ఉంటానన్నారు. చిరంజీవితో అనిల్ తెరకెక్కించిన ‘MSVPG’ సరికొత్త రికార్డులు నెలకొల్పుతోంది.
News January 27, 2026
గ్రూప్-2 ఫలితాలకు మోక్షం ఎప్పుడో?

AP: గ్రూప్-2 నోటిఫికేషన్ ప్రక్రియ నత్తనడకన సాగుతూ అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తోంది. 2023 DECలో 905 పోస్టులతో నోటిఫికేషన్ రాగా, ప్రిలిమ్స్, మెయిన్స్, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తయినా తుది ఫలితాలు విడుదల చేయలేదు. కోర్టు కేసులు, రోస్టర్, స్పోర్ట్స్ కోటా అంశాలు అడ్డంకులుగా మారాయి. ఇటీవల హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినా APPSC నిర్ణయం తీసుకోలేదు. ఈలోగా మళ్లీ కొత్త కేసులు పుట్టుకొచ్చాయి.
News January 27, 2026
యూనివర్సిటీల్లో 2,125 ఖాళీలు!

TG: యూనివర్సిటీల్లో 2,878 పోస్టులకు 753 మందే రెగ్యులర్ ఉద్యోగులు ఉండగా 2,125 ఖాళీలు ఉన్నాయి. కాంట్రాక్టు, గెస్ట్ లెక్చరర్లతో నిర్వహణ సాగుతోంది. పోస్టుల భర్తీకి 2018లో అనుమతిచ్చినా ప్రక్రియ పూర్తి కాలేదు. నియామకాల్లో తమకు న్యాయం చేయాలన్న కాంట్రాక్టు లెక్చరర్ల ఆందోళనతో ప్రక్రియ నిలిచిపోయింది. ఖాళీల భర్తీకి విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిందని సమాచారం. చివరగా 2013లో నియామకాలు జరిగాయి.


