News August 14, 2024
కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్‌ను ప్రారంభించిన సీఎం

TG: హైదరాబాద్‌లో కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్‌ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. దీని ద్వారా 15వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా 3.46 లక్షల మంది ఉద్యోగులు ఈ సంస్థలో పనిచేస్తుండగా అందులో 70శాతం భారత్‌లోనే పనిచేస్తున్నారని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు.
Similar News
News December 8, 2025
ఫ్యూచర్ సిటీలో జూపార్క్.. ‘వనతారా’తో కుదిరిన ఒప్పందం

TG: అంబానీ కుటుంబం నిర్వహిస్తున్న ‘వనతారా’ నేషనల్ జూపార్క్ ఫ్యూచర్ సిటీలోనూ ఏర్పాటు కానుంది. గ్లోబల్ సమ్మిట్‌లో తెలంగాణ ప్రభుత్వంతో వనతారా బృందం ఎంవోయూ కుదుర్చుకుంది. వనతారా నేషనల్ జూ పార్క్ ప్రస్తుతం గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉంది. ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ దీని నిర్వహణ బాధ్యతలు చూసుకుంటున్నారు. వందలాది వన్యప్రాణులను ఇక్కడ సంరక్షిస్తుండగా గతంలో PM మోదీ దీన్ని సందర్శించారు.
News December 8, 2025
ఆధార్ దుర్వినియోగాన్ని ఇలా తెలుసుకోండి!

సైబర్ మోసాలను అరికట్టేందుకు తరచూ ఆధార్ అథెంటికేషన్ హిస్టరీని చెక్ చేసుకోవాలని ‘UIDAI’ సూచించింది. దీనిద్వారా మీ ఆధార్‌ను ఎక్కడ వాడారో, ఇంకెవరైనా వాడుతున్నారో చెక్ చేసుకోవచ్చని తెలిపింది. దీనికోసం తొలుత My Aadhaar పోర్టల్‌ను సందర్శించాలి. ఆధార్ నంబర్‌తో లాగిన్ అయి ‘authentication history’ని <
News December 8, 2025
రెండు గెలాక్సీలు ఢీకొట్టుకుంటే..

ఈ విశ్వం ఎన్నో వింతలకు నిలయం. లక్షల కాంతి సంవత్సరాల దూరంలో నిత్యం అద్భుతాలు జరుగుతూనే ఉంటాయి. గెలాక్సీలు ఢీకొట్టడం/గురుత్వాకర్షణ శక్తితో ఐక్యమవడం నిరంతర ప్రక్రియ. అలా 2 గెలాక్సీలు కలిసిపోతున్న IC 1623 దృశ్యాన్ని నాసా ‘చంద్రా అబ్జర్వేటరీ’ రిలీజ్ చేసింది. ఇవి విలీనమై కొత్త నక్షత్రాలు లేదా బ్లాక్‌హోల్ ఏర్పడుతుందని తెలిపింది. కాగా ఈ చిత్రం వండర్‌ఫుల్‌గా ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.


