News October 15, 2024

కూటమి ప్రభుత్వం ఉండేది మూడేళ్లే: కాకాణి

image

AP: 2027లో జమిలి ఎన్నికలు వస్తే కూటమి ప్రభుత్వం మరో మూడేళ్లే అధికారంలో ఉంటుందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి చెప్పారు. TDP నేతల మాటలు వినే అధికారులకు ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. నూతన మద్యం పాలసీలో అనేక అక్రమాలు జరిగాయని, 90% షాపులు TDP నేతలకే దక్కాయని ఆరోపించారు. ఇసుక, గ్రానైట్, విద్య, వైద్యంలో సిండికేట్ రాజ్యం కొనసాగుతోందని మండిపడ్డారు. దోచుకోవడంలో CM చంద్రబాబు దిట్ట అని దుయ్యబట్టారు.

Similar News

News November 8, 2025

‘అలిపిరి’ అంటే అర్థం మీకు తెలుసా?

image

తిరుపతి నుంచి తిరుమల శ్రీవారి ఆలయానికి కాలినడకన వెళ్లడానికి తొలి ప్రవేశ మార్గం ‘అలిపిరి’. సోపానమార్గంలో కనిపించే తొలి ప్రదేశం ఇదే. ఈ అలిపిరిని కొందరు ‘అడిప్పడి’ అని అంటారు. అడి అంటే అడుగున ఉన్న భాగం. పడి అంటే మెట్టు. తిరుమల కొండకు అడుగున ఉన్న పడికట్టు ప్రదేశమే ఇది. కొందరు దీన్ని అడిప్పుళి అని కూడా అంటారు. పుళి అంటే చింత చెట్టు. అడుగు భాగాన కనిపించే చింతచెట్టు ప్రదేశమని దీని భావం. <<-se>>#VINAROBHAGYAMU<<>>

News November 8, 2025

గూగుల్ మ్యాప్స్‌లో ఆర్టీసీ టికెట్ బుకింగ్

image

టికెట్ బుకింగ్ కోసం APSRTC మరో కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఎక్కడి నుంచి ఎక్కడికెళ్లాలో గూగుల్ మ్యాప్స్‌లో సెర్చ్ చేస్తే ఆ రూట్‌లో తిరిగే ఆర్టీసీ రిజర్వేషన్ సదుపాయం ఉన్న బస్సులు, జర్నీ టైమ్‌ వివరాలు కనిపిస్తాయి. వాటి మీద క్లిక్ చేస్తే RTC వెబ్‌సైట్‌లోకి తీసుకెళ్తుంది. ఈ మేరకు గూగుల్ ప్రతినిధులతో చర్చలు పూర్తయ్యాయి. VJA-HYD మార్గంలో అమలుచేయగా విజయవంతమైంది. త్వరలో అన్ని రూట్లలో మొదలుకానుంది.

News November 8, 2025

ఇది రాజమౌళి మార్క్ కాదు.. పోస్టర్‌పై ఫ్యాన్స్ నిరాశ

image

రాజమౌళి-మహేశ్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న SSMB 29 సినిమా నుంచి నిన్న విడుదలైన పోస్టర్ నిరాశపరిచిందని ఫ్యాన్స్ అంటున్నారు. విలన్ పృథ్వీ సుకుమారన్ వీల్ ఛైర్‌లో కూర్చున్నట్లు ఆ పోస్టర్ ఉంది. అయితే గతంలో వచ్చిన సూర్య ’24’లో అచ్చం ఇదే లుక్ ఉందని, ఇది రాజమౌళి మార్క్ కాదని పోస్టులు చేస్తున్నారు. చూడ్డానికి AI జనరేటెడ్ పిక్‌లా ఉందంటున్నారు. మరి ఈ పోస్టర్ మీకు నచ్చిందా? కామెంట్ చేయండి.