News August 11, 2024
కుప్పకూలిన పిరమిడ్.. యుగాంతమేనంటున్న మెక్సికన్లు!

ఇటీవల వచ్చిన తుఫాను కారణంగా మెక్సికోలో పురాతనమైన యకాటా పిరమిడ్లలో ఒకటి కుప్పకూలింది. మెకొవాకాన్ రాష్ట్రంలో ఉన్న ఈ పిరమిడ్ల వద్ద తమ పూర్వీకులు వందల ఏళ్ల క్రితం మనుషుల్ని బలిచ్చేవారని స్థానిక పురెపెచ్చా జాతివారు చెబుతున్నారు. వాటిలో ఒకటి ధ్వంసం కావడమంటే ప్రపంచానికి ఏదో పెద్ద విపత్తు రాబోతోందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా పిరమిడ్ను పునరుద్ధరిస్తామని మెక్సికో పురావస్తు శాఖ తెలిపింది.
Similar News
News January 19, 2026
భారత పర్యటనలో UAE అధ్యక్షుడు

UAE అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జయేద్ అల్ నహ్యాన్ భారత్లో పర్యటిస్తున్నారు. ఢిల్లీ ఎయిర్పోర్టులో ప్రధాని మోదీ ఆయనకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. ఇద్దరూ కారులో ప్రయాణించారు. నహ్యాన్ పర్యటనతో ఇరుదేశాల మధ్య సత్సంబంధాలు మరింత బలపడతాయని మోదీ ఆకాంక్షించారు.
News January 19, 2026
జియో హాట్స్టార్ షాక్.. పెరిగిన ప్లాన్ల ధరలు

జియో హాట్స్టార్ ప్లాన్ల ధరలను సవరించింది. జనవరి 28 నుంచి అమల్లోకి వచ్చే కొత్త రేట్ల ప్రకారం సూపర్, ప్రీమియం కేటగిరీల్లోని 3 నెలల, వార్షిక ప్లాన్ల ధరలు పెరిగాయి. ముఖ్యంగా ప్రీమియం వార్షిక ప్లాన్ ₹1,499 నుంచి ₹2,199కి చేరింది. మొబైల్ ప్లాన్ ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కొత్తగా మొబైల్ ప్లాన్ ₹79, సూపర్ ₹149, ప్రీమియం ₹299 నెలవారీ ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఈ పెంపు కొత్త సబ్స్క్రైబర్లకు మాత్రమే.
News January 19, 2026
పోలాండ్ మంత్రికి ముఖం మీదే ఇచ్చిపడేసిన జైశంకర్!

పోలాండ్ విదేశాంగ మంత్రి రాడోస్లావ్ సికోర్స్కీతో భేటీలో భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సరిహద్దు ఉగ్రవాదంపై పోలాండ్ జీరో టాలరెన్స్ ప్రదర్శించాలని, భారత్ పొరుగు దేశాల్లో (పరోక్షంగా పాక్లో) ఉగ్రవాదానికి సపోర్ట్ చేయొద్దని గట్టిగా చెప్పారు. గత ఏడాది పాక్ పర్యటనకు వెళ్లిన సికోర్స్కీ కశ్మీర్పై పాక్ వాదానికి మద్దతుగా మాట్లాడారు. ఈ నేపథ్యంలోనే తాజాగా జైశంకర్ నేరుగా చురకలంటించారు.


