News September 5, 2024

ప్రొడక్టివిటీ పెంచాలని ‘పెయిడ్ టిండర్ లీవ్’ ఇచ్చిన కంపెనీ

image

ఉద్యోగుల సంక్షేమం కోరుకున్న ఓ థాయ్ కంపెనీ వారికి పెయిడ్ టిండర్ లీవ్ ఇచ్చినట్టు స్ట్రైయిట్స్ టైమ్స్ తెలిపింది. వైట్‌లైన్ గ్రూప్ ఈ డిసెంబర్ వరకు టిండర్ గోల్డ్, ప్లాటినమ్‌ సబ్‌స్క్రిప్షన్‌కు డబ్బులు ఇస్తోందట. డేటింగ్‌ తేదీకి వారం ముందు నోటీస్ ఇవ్వాలని సూచించింది. ప్రేమ వల్ల సంతోషం దాంతో ప్రొడక్టివిటీ పెరుగుతుందని కంపెనీ భావన. డేటింగ్‌‌కు వెళ్లే టైమ్ లేదన్న ఓ ఉద్యోగి మాటలే ఈ నిర్ణయానికి కారణం.

Similar News

News October 14, 2025

విశాఖలో గూగుల్ AI హబ్ లాంచ్.. మోదీ హర్షం

image

APలోని విశాఖలో గూగుల్ AI హబ్‌ లాంచ్ అవడంపై PM మోదీ హర్షం వ్యక్తం చేశారు. ‘గిగావాట్ సామర్థ్యం గల డేటా సెంటర్, భారీ పెట్టుబడులు మన వికసిత్ భారత్ లక్ష్యంలో భాగం కానున్నాయి. AI, టెక్నాలజీ, కట్టింగ్ ఎడ్జ్ టూల్స్ ప్రజలందరికీ అందుబాటులోకి తేవడంలో ఇది శక్తిమంతమైన ఆయుధంగా పనిచేయనుంది. డిజిటల్ ఎకానమీని పెంచుతూ గ్లోబల్ టెక్నాలజీ లీడర్‌గా భారత స్థానాన్ని సుస్థిరం చేయనుంది’ అని ట్వీట్ చేశారు.

News October 14, 2025

అఫ్గాన్‌, పాక్‌ మధ్య మళ్లీ హోరాహోరీ పోరు

image

పాక్, అఫ్గానిస్థాన్‌ మధ్య మళ్లీ హోరాహోరీ ఘర్షణ తలెత్తింది. ఇరుదేశాల సరిహద్దు ప్రాంతాలు కాల్పులతో దద్దరిల్లుతున్నాయి. పాక్‌ తమ పౌరులను టార్గెట్‌ చేసుకొని కాల్పులు జరుపుతోందని అఫ్గాన్‌ ఆరోపించింది. ఇప్పటివరకు ఏడుగురు చనిపోయారని వివరించింది. తమ సైన్యం కూడా దీటుగా బదులిస్తోందని పేర్కొంది. కాగా ఇటీవల జరిగిన కాల్పుల్లో 58 మంది పాక్‌ సైనికులు మరణించినట్లు అఫ్గాన్‌ ప్రకటించడం తెలిసిందే.

News October 14, 2025

హోమ్ లోన్లు తీసుకున్నవారికి గుడ్‌న్యూస్

image

రిజర్వ్ బ్యాంక్ రెపో <<17882889>>రేట్‌ను<<>> 5.50శాతంగా కొనసాగించడంతో HDFC, BOB, ఇండియన్ బ్యాంక్, IDBI బ్యాంకు MCLR రేట్లను తగ్గించాయి. దీంతో ఆయా బ్యాంకుల్లో హోమ్ లోన్లపై EMI తగ్గింది. టెన్యూర్‌ను బట్టి BOBలో కనిష్ఠంగా 7.85శాతం, గరిష్ఠంగా 8.75శాతం, IDBIలో 8-9.70శాతం, ఇండియన్ బ్యాంక్‌లో 7.95-8.85శాతం, HDFCలో 8.4-8.65 శాతం వరకు లోన్లు లభిస్తున్నాయి. తగ్గించిన వడ్డీరేట్లు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి.