News July 6, 2024

వారికి పరిహారం సరికాదు.. మద్రాస్ హైకోర్టులో పిల్

image

తమిళనాడులో కల్తీసారా ఘటనలో మృతుల కుటుంబాలకు రూ.10లక్షల పరిహారం ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మద్రాస్ హైకోర్టులో పిల్ దాఖలైంది. వారేమీ స్వాతంత్ర్య సమరయోధులు, సామాజిక కార్యకర్తలు కాదని గౌస్ తన పిల్‌లో పేర్కొన్నారు. ప్రమాదవశాత్తూ మరణించిన వారి కుటుంబాలకే ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలన్నారు. కల్తీసారా తాగి మరణించిన ఘటనలో ఇవ్వడం సరికాదని తెలిపారు. దీనిపై కోర్టు విచారణను 2వారాలకు వాయిదా వేసింది.

Similar News

News October 31, 2025

5 కేజీల భారీ నిమ్మకాయలను పండిస్తున్న రైతు

image

నిమ్మకాయ బాగా పెరిగితే కోడిగుడ్డు సైజులో ఉంటుంది. అయితే కర్నాటకలోని కొడుగు జిల్లా పలిబెట్టకు చెందిన విజు సుబ్రమణి అనే రైతు భారీ నిమ్మకాయలను పండిస్తున్నారు. ఇవి ఒక్కోటి పెద్ద సైజులో 5 కేజీల వరకు బరువు ఉన్నాయి. కొన్నేళ్ల క్రితం మైసూరు వెళ్లినప్పుడు అక్కడ మార్కెట్‌లో నిమ్మ విత్తనాలను కొని తన కాఫీ తోటలో సుబ్రమణి నాటారు. మూడేళ్ల తర్వాత నుంచి వాటిలో 2 మొక్కలకు ఈ భారీ సైజు నిమ్మకాయలు కాస్తున్నాయి.

News October 31, 2025

ఎన్టీఆర్ వైద్య సేవల పునరుద్ధరణ

image

AP: ప్రైవేటు ఆస్పత్రుల అసోసియేషన్‌తో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. వెంటనే మరో రూ.250 కోట్లు విడుదల చేస్తామని ప్రభుత్వం పేర్కొంది. నవంబర్ చివరికల్లా మొత్తం బకాయిలు ఒకే వాయిదాలో చెల్లిస్తామని మంత్రి సత్యకుమార్ హామీ ఇచ్చారు. మంత్రి హామీతో ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు ఆందోళన విరమించాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎన్టీఆర్ వైద్య సేవలు పునరుద్ధరించేందుకు నెట్వర్క్ ఆస్పత్రులు అంగీకరించాయి.

News October 31, 2025

ఫైనల్లో వర్షం పడితే..?

image

ఆదివారం భారత్-సౌతాఫ్రికా మధ్య ఉమెన్స్ వరల్డ్ కప్ ఫైనల్ జరగనుంది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచుకు 63% వర్షం ముప్పు ఉందని IMD తెలిపింది. ఎల్లుండి మ్యాచ్ సాధ్యం కాకపోతే రిజర్వ్ డే అయిన సోమవారం నిర్వహిస్తారు. ఆ రోజు కూడా వాన కారణంగా మ్యాచ్ జరగకపోతే గ్రూప్ స్టేజీలో టాప్‌లో నిలిచిన సౌతాఫ్రికానే విజేతగా ప్రకటిస్తారు. దీంతో వర్షం పడొద్దని భారత అభిమానులు కోరుకుంటున్నారు.