News November 26, 2024

రాజ్యాంగం దేశ పవిత్ర గ్రంథం: రాష్ట్రపతి

image

రాజ్యాంగం దేశ పవిత్ర గ్రంథమని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము తెలిపారు. రాజ్యాంగ వజ్రోత్సవ విషెస్ తెలిపిన ఆమె చరిత్రాత్మక ఘటనలో దేశ పౌరులందరూ భాగస్వాములు అవుతున్నారన్నారు. ‘75ఏళ్ల క్రితం ఇదే రోజు రాజ్యాంగం ఆమోదం పొందింది. ప్రజాస్వామ్య, గణతంత్ర సూత్రాల ఆధారంగా రూపకల్పన జరిగింది. రాజ్యాంగానికి రాజేంద్ర ప్రసాద్, అంబేడ్కర్ మార్గనిర్దేశం చేశారు. ప్రగతిశీల సూత్రాల గురించి పొందుపరిచారు’ అని చెప్పారు.

Similar News

News November 26, 2024

మన ధైర్యాన్ని పరీక్షించిన రోజు 26/11: సచిన్

image

ముంబైలో ఉగ్రదాడి జరిగి నేటికి 16 ఏళ్లు గడుస్తున్న సందర్భంగా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఆ రోజును ట్విటర్‌లో గుర్తుచేసుకున్నారు. ‘2008 నవంబరు 26.. మనల్ని పరీక్షించిన ఆ రోజు మన ధైర్యాన్ని దెబ్బతీయలేకపోయింది. ఓ జాతిగా మనకున్న బలాన్ని ఆరోజు మన హీరోలు చూపించిన తెగువ, ముంబైలోని ప్రతి పౌరుడి పట్టుదల ఎప్పుడూ గుర్తుచేస్తుంటాయి. గుర్తుపెట్టుకుంటాం. గౌరవించుకుంటాం. ఐకమత్యంగా ఉంటాం’ అని ట్వీట్ చేశారు.

News November 26, 2024

ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు షెడ్యూల్ విడుదల

image

ఏపీలో ఖాళీగా ఉన్న 3 రాజ్యసభ స్థానాల ఉపఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. డిసెంబర్ 3న నోటిఫికేషన్ విడుదల కానుండగా, ఆ రోజు నుంచి 10వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు డిసెంబర్ 13తో ముగియనుంది. డిసెంబర్ 20న పోలింగ్, అదే రోజు కౌంటింగ్ జరగనుంది. మోపిదేవి, బీద మస్తాన్, ఆర్.కృష్ణయ్య రాజీనామాలతో 3 రాజ్యసభ స్థానాలు ఖాళీ అయిన సంగతి తెలిసిందే.

News November 26, 2024

జగన్, అదానీ ముడుపుల వ్యవహారంపై సీఎంతో చర్చిస్తాం: పవన్

image

AP: వైసీపీ ప్రభుత్వ తప్పులు రాష్ట్రానికి శాపాలుగా మారాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. వాటిని ఇప్పుడు తాము సరిదిద్దాల్సి వస్తోందన్నారు. జగన్, అదానీ ముడుపుల వ్యవహారంపై సీఎం చంద్రబాబుతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. గత ప్రభుత్వానికి అస్సలు బాధ్యత లేదని, సమోసాల కోసమే రూ.9కోట్లు ఖర్చు చేసిందని విమర్శించారు.