News November 22, 2024
టిష్యూ ఖరీదు రూ.8.4 కోట్లు.. ఎందుకంటే?
అర్జెంటీనా ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ ప్లేయర్ మెస్సీకి ప్రపంచవ్యాప్తంగా కోట్లల్లో అభిమానులున్నారు. అందులో కొందరు ఆయన ధరించిన జెర్సీ, షూ తదితర వస్తువులను వేలంలో రూ.కోట్లు చెల్లించి దక్కించుకుంటారు. అలాంటి ఓ వేలంలో మెస్సీ తన కన్నీళ్లు తుడుచుకోడానికి వాడిన టిష్యూ కూడా ఉంది. వరల్డ్ కప్ -2022 విజయం తర్వాత ఆయన భావోద్వేగం చెందుతూ వినియోగించిన టిష్యూను $1 మిలియన్(రూ.8.45 కోట్లు)కు ఓ వ్యక్తి కొనుగోలు చేశారు.
Similar News
News November 22, 2024
గంభీర్ మాటలతో స్ఫూర్తి పొందాను: నితీశ్ రెడ్డి
బౌన్సర్ అయినా సరే తట్టుకుని నిలబడాలని కోచ్ గౌతమ్ గంభీర్ చెప్పిన మాటలు తనకు స్ఫూర్తినిచ్చాయని టీమ్ ఇండియా ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి తెలిపారు. ‘చివరి ప్రాక్టీస్ సెషన్ తర్వాత గౌతమ్ నాతో మాట్లాడారు. బౌన్సర్ వచ్చినప్పుడు దేశం కోసం తూటాకు అడ్డునిలబడినట్లే భావించాలని చెప్పారు. ఆ మాటలు నాలో నాటుకుపోయాయి. ఆయన్నుంచి నేను విన్న బెస్ట్ సలహా అది’ అని పేర్కొన్నారు.
News November 22, 2024
రూ.5,260 కోట్ల పెట్టుబడులు, 12,490 ఉద్యోగాలు: ప్రభుత్వం
TG: దేశంలో పేరొందిన ఫార్మా కంపెనీలు HYDలో భారీ పెట్టుబడులకు ముందుకొచ్చాయని ప్రభుత్వం తెలిపింది. కంపెనీల కార్యకలాపాల విస్తరణతో పాటు కాలుష్యరహితంగా ఏర్పాటు చేసే గ్రీన్ ఫార్మా కంపెనీలను నెలకొల్పేందుకు అవగాహన ఒప్పందాలు చేసుకున్నాయని పేర్కొంది. 6 కంపెనీలు రూ.5,260 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయని, వీటి ద్వారా 12,490 మందికి ఉద్యోగాలు లభిస్తాయని వివరించింది.
News November 22, 2024
కేజ్రీవాల్ కంటే ఆతిశీ వెయ్యి రెట్లు నయం: LG
ఆప్ ప్రభుత్వంతో నిత్యం తగువుకు దిగే LG సక్సేనా మొదటి సారి CM ఆతిశీని ప్రశంసించారు. IGDT మహిళా యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ఆయన మాట్లాడారు. ‘లింగ భేదాన్ని నిలువరించి ఇతరులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో నిరూపించుకోవాలి. ఈ రోజు ఢిల్లీ సీఎం మహిళ అయినందుకు సంతోషిస్తున్నా. గత పాలకుడి(కేజ్రీవాల్) కంటే ఆమె వెయ్యి రెట్లు నయం’ అన్నారు. LG వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి.