News March 22, 2024
ఈ ఔషధం ఖరీదు రూ.35 కోట్లు..
పిల్లల్లో జన్యుపరమైన లోపంతో వచ్చే మెటాక్రోమాటిక్ ల్యూకోడిస్ట్రోఫీ(MLD) అనే అరుదైన వ్యాధికి ఆర్చర్డ్ థెరప్యూటిక్(US) సంస్థ ఔషధాన్ని తయారుచేసింది. ‘లెన్మెల్డీ’ అని పిలిచే ఈ డ్రగ్ ఖరీదు రూ.35 కోట్లు. ఇది ప్రపంచంలోనే ఖరీదైన ఔషధంగా నిలిచింది. MLD వల్ల మెదడు, నాడీ వ్యవస్థలో ఎంజైమ్స్ లోపం తలెత్తుతుంది. ఎదుగుదల ఆలస్యమవడం, కండరాల బలహీనత సమస్యలు వస్తాయి. తొలి దశలోనే గుర్తిస్తే లెన్మెల్డీతో నయం చేయొచ్చు.
Similar News
News December 28, 2024
గాజాలో ఆస్పత్రిని తగలబెట్టిన ఇజ్రాయెల్ సైనికులు
వెస్ట్ ఏషియా మళ్లీ రగిలిపోతోంది. ఇజ్రాయెల్ సైనికులు కమల్ అద్వాన్ ఆస్పత్రిలో ప్రవేశించి పేషంట్లు, వైద్యులను పంపించేశారు. ప్రాంగణంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి ఉందన్న సమాచారంతో దానిని తగలబెట్టేశారు. మరోవైపు యెమెన్ నుంచి హౌతీలు ప్రయోగించిన మిసైళ్లను IDF అడ్డుకుంది. సరిహద్దుకు బయటే కూల్చేసినా దేశంలో సైరన్లు మోగినట్టు ప్రకటించింది. గురువారం యెమెన్ విమానాశ్రయాలపై దాడికి నిరసనగా హౌతీలు ప్రతిదాడి చేశారు.
News December 28, 2024
నితీశ్ కుమార్ రెడ్డికి నగదు బహుమతి
AP: ఆస్ట్రేలియాపై సెంచరీ చేసిన నితీశ్ కుమార్ రెడ్డికి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ నజరానా ప్రకటించింది. అతడికి రూ.25 లక్షల నగదు బహుమతి ఇవ్వనున్నట్లు ACA ప్రెసిడెంట్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడించారు. త్వరలో సీఎం చేతుల మీదుగా నగదు అందిస్తామని పేర్కొన్నారు. ఏపీకి కూడా ఐపీఎల్ టీమ్ సిద్ధం చేస్తామని, అమరావతిలో ఇంటర్నేషనల్ సౌకర్యాలతో స్టేడియం నిర్మిస్తున్నామని చెప్పారు. నితీశ్ స్వస్థలం వైజాగ్.
News December 28, 2024
సిఫార్సు లేఖలపై నిర్ణయం తీసుకోలేదు: టీటీడీ ఈవో
తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలకు అనుమతిచ్చే విషయమై టీటీడీ ఈవో శ్యామలరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంకా దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ సమయంలో దాతలకు ప్రత్యేకంగా గదుల కేటాయింపు ఉండదన్నారు.