News June 30, 2024

మీలాంటి అధికారులే దేశానికి కావాల్సింది!

image

TG: 2024 బ్యాచ్ ట్రైనీ AIS(All India Services)లు మంచి మనసు చాటుకున్నారు. వారి ట్రావెలింగ్ అలవెన్స్ రూ.1.30లక్షలను ‘సుకన్య సమృద్ధి’కి అందించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన 65 మంది ట్రైనీ AISలు HYDలో 100 మంది బాలికలకు ఖాతాలు తెరిపించి ₹1000 చొప్పున జమ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల విద్యార్థినులందర్నీ ‘బాలికా సుకన్య సమృద్ధి యోజన’లో చేర్చడమే లక్ష్యంగా కార్యాచరణ ప్రారంభించారు.

Similar News

News January 28, 2026

మెదక్: హత్య కేసులో నిదితుడికి జీవిత ఖైదు

image

మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి కంపెనీ వద్ద బీహార్ రాష్ట్రానికి చెందిన సర్వాన్ కుమార్ హత్యకు పాల్పడిన నిందితుడు ఓం ప్రకాష్ రాయ్‌కి జీవిత ఖైదు, రూ.10 వేల జరిమానా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నీలిమ తీర్పునిచ్చినట్లు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. సునీల్ మొంజి, ధనుంజయ్, సర్వాన్ కుమార్ సోదరులు ఓ కంపెనీలో పనిచేస్తూ ఇక్కడే ఉంటున్నారన్నారు. ఓం ప్రకాష్ రాయ్ రాయితో కొట్టి హత్య చేసినట్లు వివరించారు.

News January 28, 2026

మున్సి’పోల్స్’.. నేటి నుంచి నామినేషన్లు

image

TG: మున్సిపల్ ఎన్నికల <<18974641>>నామినేషన్ల<<>> ప్రక్రియ నేటి నుంచి ఈ నెల 30 వరకు కొనసాగనుంది.
నామినేషన్‌కు కావాల్సినవి: నామినేషన్ ఫారం, పుట్టిన తేదీ ధ్రువీకరణ (SSC/ఓటర్ ఐడీ/ఆధార్ జిరాక్స్), కుల ధ్రువీకరణ పత్రం (రిజర్వుడు స్థానాల్లో), నామినేషన్ డిపాజిట్, సెల్ఫ్ అఫిడవిట్ (ఆస్తులు, విద్యార్హతలు, కేసులు), కొత్త బ్యాంక్ అకౌంట్ జిరాక్స్, సెల్ఫ్ డిక్లరేషన్, ప్రాపర్టీ నో డ్యూ సర్టిఫికెట్, ఫొటోలు.

News January 28, 2026

OTTలోకి కొత్త సినిమా.. 2 వారాల్లోనే!

image

తమిళ హీరో కార్తి, కృతి శెట్టి జంటగా నటించిన ‘వా వాతియార్’ (తెలుగులో ‘అన్నగారు వస్తారు’) సినిమా OTTలోకి వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. ఈ నెల 14న థియేటర్లలో విడుదలైన తమిళ వెర్షన్ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో ఇతర భాషల్లో రిలీజ్ చేయకుండా 2 వారాల్లోనే నేరుగా OTTలో స్ట్రీమింగ్‌ చేస్తున్నారు. ఈ మూవీకి నలన్ కుమారస్వామి డైరెక్టర్.