News April 3, 2024
వాలంటీర్లతో పెన్షన్లు పంపిణీ చేయాలన్న పిటిషన్ కొట్టేసిన కోర్టు

AP: వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీ చేయాలన్న పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. వాలంటీర్ల స్థానంలో పెన్షన్ల పంపిణీకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు ప్రభుత్వం ఇచ్చిన వివరణతో న్యాయస్థానం ఏకీభవించింది. పెన్షన్లను వాలంటీర్లతో పంపిణీ చేయకూడదన్న ఈసీ ఆదేశాలపై సంతృప్తి వ్యక్తం చేసింది.
Similar News
News April 13, 2026
ఇంటర్ ఫలితాలు.. 8 మంది విద్యార్థుల ఆత్మహత్య

TG: ఇంటర్ ఫలితాల వేళ రాష్ట్రంలో తీవ్ర విషాదం నెలకొంది. పరీక్షల్లో పాసవ్వలేదనే కారణంతో పలు జిల్లాల్లో ఎనిమిది మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఎగ్జామ్స్‌లో విఫలమవడమంటే జీవితంలోనే ఓడిపోవడం కాదనే విషయాన్ని మరిచి తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చారు. మార్కులే భవిష్యత్తు కాదనే విషయాన్ని పిల్లలకు పేరెంట్స్, టీచర్స్ అర్థమయ్యేలా వివరించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా ఈ విషయంపై అవగాహన కల్పించాలి.
News April 13, 2026
పిచ్చి పీక్స్.. చందమామపై ‘ట్రంప్ టవర్’

చంద్రునిపై తన పేరుతో టవర్ ఉన్నట్లు చూపే AI ఫొటోను US అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ SM అకౌంట్‌లో పోస్ట్ చేశారు. నాసా చేపట్టిన ఆర్టెమిస్-2 మిషన్ విజయవంతంగా ముగిసిన సందర్భంగా ఆయన ఈ పోస్ట్ పెట్టినట్లు తెలుస్తోంది. గోల్డ్ ఫినిషింగ్‌తో మెరిసిపోతున్న ఈ భవనం చంద్రమండలంపై అమెరికా ఆధిపత్యాన్ని సూచిస్తున్నట్లుగా ఉంది. అంతరిక్ష రంగంలో US ఎప్పటికీ టాప్‌లో ఉంటుందని తెలిపేలా ట్రంప్ ఈ విధంగా పోస్ట్ చేశారు.
News April 13, 2026
రాకా: సైన్స్ ఫిక్షన్+ మైథాలజీ?

అట్లీ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘రాకా’లో అల్లు అర్జున్ లుక్ మూవీపై హైప్‌ను పెంచింది. ఈ చిత్రంపై ఓ క్రేజీ బజ్ వైరలవుతోంది. ఇందులో సైన్స్ ఫిక్షన్‌తోపాటు మైథాలజీని కూడా టచ్ చేసినట్లు సమాచారం. తోడేళ్లకు సంబంధించి పురాణాల్లో ఉన్న ఆసక్తికర అంశాలను ఈ సినిమాలో మిక్స్ చేసినట్లు తెలుస్తోంది. కాగా ఈ ప్రాజెక్టుకు సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందిస్తుండగా దీపికా పదుకొణె, రష్మిక కీలక పాత్రలు పోషిస్తున్నట్లు టాక్.


