News April 24, 2024
కేజ్రీవాల్ అభ్యర్థనను తిరస్కరించిన కోర్టు

డాక్టర్ను సంప్రదించేందుకు అనుమతి కోరుతూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. ఆయనకు అనుమతి ఇచ్చేందుకు నిరాకరించింది. మధుమేహం, రక్తంలో చక్కెర స్థాయి హెచ్చుతగ్గులకు సంబంధించి ప్రతిరోజూ 15 నిమిషాల పాటు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వైద్యుడిని సంప్రదించేందుకు అనుమతివ్వాలని ఆయన కోర్టును ఆశ్రయించారు. తనకు ఇన్సులిన్ ఇచ్చేలా జైలు అధికారులను ఆదేశించాలని కోరారు.
Similar News
News November 26, 2025
SKLM: ఎస్పీ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవం

శ్రీకాకుళం జిల్లా పోలీస్ కార్యాలయంలో బుధవారం భారత రాజ్యాంగం దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారత రాజ్యాంగం దేశ ప్రజాస్వామ్యానికి పునాది అని అన్నారు. అంబేడ్కర్ చిరస్మరణీయులని ఆయన ఆశయాలను కొనసాగించేందుకు ప్రయత్నం చేయాలన్నారు. చట్ట పాలనను సాగించడంలో పోలీసులు ముందుండాలన్నారు.
News November 26, 2025
నితీశ్ కుమార్ రెడ్డి.. అట్టర్ ఫ్లాప్ షో!

తక్కువ కాలంలోనే మూడు ఫార్మాట్లలో చోటు దక్కించుకున్న తెలుగు తేజం నితీశ్ కుమార్ రెడ్డి ఇటీవల ఘోరంగా విఫలం అవుతున్నారు. గతేడాది ఆస్ట్రేలియాపై మెల్బోర్న్లో సెంచరీ తర్వాత అతడు ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేదు. ఆ సెంచరీ తర్వాత అతడి 10 ఇన్నింగ్సుల స్కోర్ 1, 0, 4, 1, 1, 30, 13, 43, 10, 0గా ఉంది. అంటే 10 ఇన్నింగ్సుల్లో 10 సగటుతో 103 రన్స్ చేశారు. అటు బౌలింగ్లోనూ వికెట్లు తీయలేకపోతున్నారు.
News November 26, 2025
వైరల్ అయ్యాక అసభ్యకర మెసేజ్లు వచ్చాయి: నటి

ఆకర్షణీయమైన లుక్స్తో సోషల్ మీడియాలో వైరలయిన తర్వాత తనకు అసభ్యకరమైన మెసేజ్లు వచ్చాయని నటి గిరిజా ఓక్ ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. ‘ఆ ఇంటర్వ్యూ తర్వాత నాకు ఆఫర్లేమీ రాలేదు. కానీ చాలా మంది మెసేజ్లు పంపారు. ఒక అవకాశం ఇస్తే మీ కోసం ఏదైనా చేస్తానని.. వాళ్లతో గంట గడిపేందుకు రేటు ఎంతో చెప్పాలని కొందరు అభ్యంతరకర మెసేజ్లు పంపారు’ అని ఆమె చెప్పుకొచ్చారు.


