News December 26, 2024
కుప్పకూలిన విమానం.. పైలట్ చివరి మాటలివే..
నిన్న కజకిస్థాన్‌లో ఘోర విమాన ప్రమాదానికి ముందు పైలట్ మాట్లాడిన మాటలు వెలుగులోకి వచ్చాయి. ఉ.8.16 గంటలకు ఫ్లైట్‌ను పక్షి ఢీకొట్టిందని పైలట్ రాడార్‌కు సమాచారమిచ్చాడు. అయితే విమానాన్ని ఎడమవైపు ఆర్బిట్‌లో నడపాలని చెప్పగా ‘నా కంట్రోల్లో ఏమీ లేదు’ అని పైలట్ సమాధానం ఇచ్చాడు. కొద్దిసేపటికే రాడార్‌తో సిగ్నల్స్ పూర్తిగా కట్ అయ్యాయి. ఆ తర్వాత అరగంటకే కజకిస్థాన్‌లోని ఆక్తావులో ఫ్లైట్ నేలను ఢీకొట్టింది.
Similar News
News December 27, 2024
డెడ్ బాడీ పార్శిల్.. మిస్టరీ వీడింది
AP: ప.గో జిల్లా యండగండిలో డెడ్ బాడీ పార్శిల్ కేసు కొలిక్కి వచ్చింది. వదిన ఆస్తిని కాజేసేందుకు శ్రీధర్ వర్మ ఓ అమాయకుడిని హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. శవం పేరుతో వదిన తులసిని భయపెట్టాలని చూసిన శ్రీధర్.. ఎవరూ లేని బర్రె పర్లయ్యను చంపేశాడని తెలిపారు. డెడ్ బాడీని పార్శిల్ చేసి అదే రోజు ఆస్తి పత్రాలపై సంతకాలు సేకరించే ప్రయత్నం చేశాడు. వర్మతో పాటు భార్యలు రేవతి, సుష్మను పోలీసులు అరెస్టు చేశారు.
News December 27, 2024
CA ఫలితాలు.. మనోళ్లే టాప్ ర్యాంకర్స్
ఛార్టెడ్ అకౌంటెంట్స్(CA) తుది ఫలితాలు విడుదలయ్యాయి. పరీక్షలకు హాజరైన అభ్యర్థులు <
News December 27, 2024
మన్మోహన్ విలక్షణ పార్లమెంటేరియన్: మోదీ
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ భౌతికకాయానికి నివాళులర్పించిన ప్రధాని మోదీ ఆయన సేవలను కొనియాడారు. దేశం, ప్రజల పట్ల ఆయన అంకితభావం స్మరించుకోదగిందన్నారు. పీవీ హయాంలో ఆర్థిక మంత్రిగా దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చివేశారని గుర్తు చేశారు. ఆర్బీఐ గవర్నర్ సహా అనేక కీలక పదవులు చేపట్టినా సామాన్య జీవితం గడిపారని కొనియాడారు. ఆయనో విలక్షణ పార్లమెంటేరియన్ అని మోదీ కీర్తించారు.