News August 28, 2024

‘గబ్బర్ సింగ్’ రీరిలీజ్‌కు క్రేజ్ మామూలుగా లేదుగా!

image

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీశ్ శంకర్ తెరకెక్కించిన ‘గబ్బర్ సింగ్’ సినిమా మరోసారి థియేటర్లలో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 2న ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతుండటంతో అభిమానులు ముందస్తుగా టికెట్స్ బుక్ చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో రిలీజ్‌కు ఐదు రోజులు ఉండగానే అడ్వాన్స్ బుకింగ్స్‌ రూ.కోటి దాటినట్లు మేకర్స్ తెలిపారు. మూవీకి మీరూ వెళ్తున్నారా?

Similar News

News March 8, 2026

ఈరోజైనా అభి’షేక్’ చేస్తాడా?

image

T20 WCలో నిరాశ పరుస్తున్న భారత ఓపెనర్ అభిషేక్ శర్మ ఇవాళ NZతో ఫైనల్లోనైనా చెలరేగి ఆడాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఫామ్‌లో ఉన్న శాంసన్‌కు తోడు అభి రాణిస్తే బ్యాటింగ్‌లో INDకి తిరుగుండదు. నిన్న ప్రాక్టీస్ టైమ్‌లో అభితో హెడ్ కోచ్ గంభీర్ 40 నిమిషాలపాటు మాట్లాడినట్లు క్రీడా వర్గాలు తెలిపాయి. కాగా ఈ WCలో ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ 7 ఇన్నింగ్స్‌లలో 89 రన్స్ మాత్రమే చేశారు. ఇందులో 3 డకౌట్లు ఉన్నాయి.

News March 8, 2026

WBలో ప్రొటోకాల్ వివాదం.. అమిత్ షా, CBN ఏమన్నారంటే

image

ప.బెంగాల్‌లోని TMC ప్రభుత్వం తమ అరాచక ప్రవర్తనతో అథఃపాతాళానికి దిగజారిందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మండిపడ్డారు. ‘ప్రోటోకాల్‌ పాటించకుండా రాష్ట్రపతిని అవమానించారు. <<19322594>>ఈ ఘటన<<>> దేశానికి, ప్రజాస్వామ్యానికి అవమానం’ అని ట్వీట్ చేశారు. రాష్ట్రపతిని అవమానించేలా WB ప్రభుత్వం వ్యవహరించడం దురదృష్టకరమని, ఈ ఘటన బాధ కలిగించిందని AP CM CBN తెలిపారు. రాష్ట్రపతి పట్ల గౌరవంతో మెలగాలన్నారు.

News March 8, 2026

చరిత్రలో ఈరోజు (మార్చి 8)

image

1897: చిత్రకారుడు దామెర్ల రామారావు జననం
1917: విద్యుత్తు రంగ నిపుణుడు నార్ల తాతారావు జననం
1989: భారత మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ జననం
1993: చిలకలూరిపేట బస్సు దహనం ఘటనలో 23 మంది మృతి
2012: సినీ నటి రాధాకుమారి మరణం
☛ అంతర్జాతీయ మహిళా దినోత్సవం