News December 13, 2024
విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ ఒక చరిత్ర

AP: స్వర్ణాంధ్ర@2047 విజన్ డాక్యుమెంట్ను ఆవిష్కరించడం చరిత్రాత్మకమని సీఎం చంద్రబాబు అన్నారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే దీనిని రూపొందించామని చెప్పారు. ‘తెలుగు జాతి ప్రపంచంలోనే నంబర్వన్గా ఉండాలి. అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలవాలి. గత ప్రభుత్వంలో ఊహించని విధ్వంసం జరిగింది. ఇప్పుడు దానిని సరిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Similar News
News December 26, 2025
న్యూ ఇయర్ బెస్ట్ రెజల్యూషన్స్.. ట్రై చేసి చూడండి

*రోజుకు కొంత మొత్తాన్ని సేవ్ చేయండి. భవిష్యత్లో ఇదే పెద్ద అమౌంట్గా మారి ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఇస్తుంది. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, డిజిటల్ గోల్డ్ లాంటివి ట్రై చేయవచ్చు.
*రోజుకు 8వేల-10వేల అడుగుల దూరం నడవండి. పొద్దున్నే ఓ గ్లాస్ వేడి నీరు తాగడం అలవాటు చేసుకోండి. దీనివల్ల రోజంతా ఉత్సాహంగా ఉంటారు
*పెయింటింగ్, ఏఐ, రైటింగ్, డాన్స్, సింగింగ్ ఇలా ఏదో ఒక స్కిల్ నేర్చుకోండి.
News December 26, 2025
భారత్ డైనమిక్స్ లిమిటెడ్(BDL)లో ఉద్యోగాలు.. అప్లైకి 3 రోజులే సమయం

<
News December 26, 2025
కూరగాయల పంటకు తెగుళ్ల నుంచి సహజ రక్షణ

పొలం చుట్టూ, గట్ల వెంబడి ఎలాంటి కలుపు మొక్కలు లేకుండా శుభ్రం చేసుకోవాలి. అలాగే పొలం చుట్టూ గట్ల వెంబడి, నాటుకు కనీసం రెండు వారాల ముందు 3-4 వరుసల్లో మొక్కజొన్న పంటను కంచే పంటగా నాటుకోవాలి. దీనివలన ఈ మొక్కలు కూరగాయ పంటకు ప్రహారీలా ఉండి, పక్క పొలాల నుంచి పురుగులు రాకుండా రక్షణ కల్పిస్తాయి. మొక్కజొన్న మొక్కల్లో వచ్చిన కంకులను విక్రయించడం ద్వారా రైతుకు అదనపు ఆదాయం కూడా సమకూరుతుంది.


