News December 6, 2024

టెక్నాలజీ, విద్యుత్ రంగంలో సంస్కరణల ఘనత నాదే: సీఎం

image

AP: 1995లో తొలిసారి సీఎం అయ్యాక హైదరాబాద్‌లో ఐటీ రంగం అభివృద్ధికి కృషి చేసినట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. పీపీపీ పద్ధతిలో హైటెక్ సిటీని నిర్మించినట్లు గుర్తుచేశారు. విదేశాల్లో ఉన్న మనదేశ IT నిపుణుల్లో 30 శాతం మంది తెలుగువారేనని విశాఖ డీప్‌టెక్ సదస్సులో తెలిపారు. టెక్నాలజీ, విద్యుత్ రంగంలో సంస్కరణల ఘనత తనదేనన్నారు. ప్రతి ఒక్కరూ ఇంటిపైనే విద్యుత్ ఉత్పత్తి చేసుకునే అవకాశం ఇప్పుడు ఉందని పేర్కొన్నారు.

Similar News

News January 2, 2026

మహిళల కోసం కొత్త స్కీమ్.. వివరాలివే

image

TG: మహిళా సంఘాల సభ్యుల కోసం ప్రభుత్వం ‘ఇందిరా డెయిరీ ప్రాజెక్టు’ను తీసుకొచ్చింది. ఒక్కొక్కరికి 2 పాడి గేదెలు/ఆవులు అందించనుంది. పైలట్ ప్రాజెక్టుగా ఖమ్మం(D) మధిర నియోజకవర్గంలో ఈ ప్రాజెక్టును ప్రారంభించింది. కొడంగల్ సహా ఇతర ప్రాంతాలకూ విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఒక్కో యూనిట్ ధర రూ.2లక్షలు కాగా అందులో ప్రభుత్వం ₹1.40లక్షలు సబ్సిడీ ఇస్తుంది. మిగతా ₹60వేలు బ్యాంకులు లోన్ ఇస్తాయి.

News January 2, 2026

బాలింతలు ఏం తినాలంటే?

image

ప్రసవమయ్యాక కొన్నిరోజులపాటు బాలింతకు తేలికగా జీర్ణమయ్యే, బలవర్ధకమైన ఆహారం ఇవ్వాలి. అప్పుడే బిడ్డకు సరిపడా పాలు పడతాయి. పాలు, నెయ్యి ఎక్కువగా తీసుకోవాలి. బీర, పొట్ల, సొర, కాకర, క్యారెట్, బీట్రూట్, బెండ వంటి కూరగాయలు ఆహారంలో చేర్చుకోవాలి. కిచిడీ, పులగన్నం తీసుకోవాలి. వెల్లుల్లి, మెంతులు, జీలకర్ర, ధనియాలు, ఇంగువ ఆహారంలో ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇవి గర్భాశయ ఆరోగ్యానికి దోహదం చేస్తాయి.

News January 2, 2026

రోహిత్ శర్మ ‘పీపుల్స్ కెప్టెన్’: MSK ప్రసాద్

image

రోహిత్ శర్మ ‘పీపుల్స్ కెప్టెన్’ అని మాజీ చీఫ్ సెలక్టర్ MSK ప్రసాద్ అన్నారు. ‘ధోనీ, కోహ్లీల కాంబినేషన్ రోహిత్. వారిద్దరి నుంచి మంచి క్వాలిటీలను తీసుకుని కెప్టెన్‌గా ఎదిగారు. ధోనీ నుంచి కూల్‌నెస్, విరాట్ నుంచి దూకుడు అందిపుచ్చుకుని తనదైన శైలిలో జట్టును నడిపించారు. యంగ్ క్రికెటర్లతో రోహిత్ చాలా సరదాగా ఉంటూ ఫలితాలు రాబట్టారు’ అని ఓ పాడ్‌‍కాస్ట్‌లో వివరించారు.