News October 11, 2024

మోదీ బహుమతిగా ఇచ్చిన కిరీటం చోరీ

image

బంగ్లాదేశ్‌లోని జెశోరేశ్వరి ఆలయంలోని కాళీ మాత కిరీటం చోరీకి గురైంది. ఈ కిరీటాన్ని 2021లో బంగ్లాకు వెళ్లిన సమయంలో ప్రధాని మోదీ దీనిని బహుమతిగా ఇచ్చారు. నిన్న మధ్యాహ్నం ఈ దొంగతనం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఆలయ సీసీటీవీ విజువల్స్ ద్వారా దొంగను గుర్తించే పనిలో ఉన్నట్లు చెప్పారు. కాగా ఈ కిరీటం వెండి, బంగారు లోహాలతో తయారు చేశారు.

Similar News

News January 24, 2026

న్యూజిలాండ్‌పై భారత్ ఘనవిజయం

image

U19-WCలో న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం సాధించింది. వర్షం ఆటంకం కలిగించడంతో DLS ప్రకారం 130 పరుగులకు కుదించిన <<18946505>>లక్ష్యాన్ని<<>> 13.3 ఓవర్లలోనే ఛేదించింది. కెప్టెన్ ఆయుశ్ 27 బంతుల్లో 6 సిక్సర్లు, 2 ఫోర్లతో 53 రన్స్ చేయగా ఓపెనర్ వైభవ్ 23 బంతుల్లో 3 సిక్సర్లు, 2 ఫోర్లతో 40 రన్స్ చేశారు. వీరిద్దరు ఔటైనా మల్హోత్రా, త్రివేది జట్టును విజయతీరాలకు చేర్చారు. NZ బౌలర్లలో క్లర్క్, సంధు, సంజయ్ తలో వికెట్ తీశారు.

News January 24, 2026

సింగరేణి రికార్డులను సీజ్ చేయాలి: మంత్రి సంజయ్

image

TG: ఉమ్మడి APలో కన్నా ప్రస్తుత BRS, INC పాలనలోనే సింగరేణి ఎక్కువ దోపిడీకి గురైందని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. అక్రమాలకు సంబంధించి రికార్డులు తారుమారయ్యే ప్రమాదం ఉందని, వాటిని సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ‘ఫోన్ ట్యాపింగ్ కేసులో KTRను సాక్షిగా పిలిచామని మంత్రులు అంటుంటే విచారణకు పిలిచామని సజ్జనార్ చెబుతున్నారు. ఏది నిజం? KTR, KCRలకు ప్రభుత్వం క్లీన్ చిట్ ఇస్తోందా?’ అని ప్రశ్నించారు.

News January 24, 2026

RCB బ్యాటింగ్.. జైత్రయాత్ర కొనసాగేనా?

image

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌(WPL)లో భాగంగా కాసేపట్లో ఆర్సీబీ, ఢిల్లీ మధ్య మ్యాచ్ ప్రారంభం కానుంది. టాస్ నెగ్గిన ఢిల్లీ.. ఆర్సీబీని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఇప్పటివరకు 5 మ్యాచులాడి అన్నింట్లో గెలిచిన బెంగళూరు ఇందులోనూ విజయం సాధించి జైత్రయాత్ర కొనసాగించాలని ఉవ్విళ్లూరుతోంది. అటు 5 మ్యాచుల్లో 2 నెగ్గిన DC.. RCBకి తొలి ఓటమి రుచి చూపించాలని పట్టుదలతో ఉంది. మరి ఎవరు గెలుస్తారో కామెంట్ చేయండి.