News May 11, 2024

ఇప్పుడిదే ట్రెండ్: బాబాయ్.. మీ ఊరిలో ఎంతిస్తున్నారు?

image

AP ఎన్నికలను పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో పోటీ తీవ్రంగా ఉంది. ఓటర్లకు గాలం వేయడానికి ఇప్పటికే ‘పంపకాలు’ మొదలయ్యాయి. ఫోన్లలో బంధువులతో కుటుంబ విషయాల కంటే.. ‘మీ ఊరిలో ఎవరు ఎంతిస్తున్నారు?’ అనే ప్రశ్నే ఎక్కువగా వినిపిస్తోంది. డిమాండ్‌ను బట్టి రూ.2,000-రూ.10,000 పంచుతున్నారట. అయితే అధికారులకు ఎక్కడా కనిపించట్లేదు. ఇదేం విచిత్రమో మరి! ఇంతకీ మీ ఊరి సంగతేంటి?
<<-se>>#ELECTIONS2024<<>>

Similar News

News September 18, 2025

ఈ సాయంత్రం ఢిల్లీకి సీఎం రేవంత్

image

TG: సీఎం రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం 5 గంటలకు ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు అక్కడ జరిగే ఇన్వెస్టర్ల సమావేశంలో పాల్గొననున్నారు. అలాగే కేంద్రమంత్రులతో పాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిసే అవకాశం ఉంది.

News September 18, 2025

కోళ్లలో రక్తపారుడు వ్యాధి – లక్షణాలు

image

కోళ్లలో వైరస్, సూక్ష్మజీవుల వల్ల రక్తపారుడు వ్యాధి వస్తుంది. ఇది కూడా చిన్న కోడి పిల్లల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది. ఈ రోగం వస్తే కోళ్లలో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. వ్యాధి బారినపడ్డ కోడి పిల్లలు ఒకేచోట గుమిగూడి రక్త విరేచనాలతో బాధపడతాయి. లక్షణాలు మరీ తీవ్రంగా మారితే కోడి పిల్లలు మరణించే అవకాశం ఉంది. వ్యాధి నివారణకు <<17696499>>లిట్టరు<<>>ను పొడిగా ఉంచాలి. వెటర్నరీ నిపుణులకు తెలిపి వారి సలహాలను పాటించాలి.

News September 18, 2025

OFFICIAL: ‘కల్కి-2’ నుంచి దీపికా పదుకొణె ఔట్

image

రెబల్ స్టార్ ప్రభాస్ ‘కల్కి’ మూవీలో కీలక పాత్రలో నటించిన దీపికా పదుకొణె రాబోయే సీక్వెల్‌లో నటించబోరని మేకర్స్ ప్రకటించారు. ‘కల్కి-2లో దీపిక భాగం కాదని ప్రకటిస్తున్నాం. అన్నివిధాలుగా పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నాం. కల్కిలాంటి సినిమాలో నటించే నటులకు ఎక్కువ కమిట్మెంట్ అవసరం. దీపిక తదుపరి సినిమాలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం’ అని వైజయంతి మూవీస్ ట్వీట్ చేసింది.