News January 16, 2025
ఎట్టకేలకు ఇజ్రాయెల్-హమాస్ యుద్ధానికి తెర
ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఎట్టకేలకు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. గాజాలో శాంతి స్థాపనకు ఇరుదేశాలు అంగీకారానికి వచ్చాయి. ఖతర్ మధ్యవర్తిత్వంతో బందీల విడుదలకు సంబంధించి ఇజ్రాయెల్-హమాస్ ఒప్పందానికి వచ్చాయి. యుద్ధం ముగింపునకు అమెరికా, ఈజిప్ట్ కూడా తీవ్రంగా కృషి చేశాయి. కాగా 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడితో యుద్ధం మొదలైంది.
Similar News
News January 16, 2025
హమాస్ చెరలో 100 మందికిపైగా బందీలు
ఇజ్రాయెల్‌పై దాడి చేసిన హమాస్ మిలిటెంట్లు 250 మందిని కిడ్నాప్ చేయగా ఇప్పటికీ వీరిలో 100 మందికి పైగా బందీలుగానే ఉన్నారు. వీరిని విడుదల చేసేందుకు అంగీకారం కుదిరినా కనీసం మూడింట ఒక వంతు మంది ప్రాణాలతో లేరని సమాచారం. ఇదే నిజమైతే ఇజ్రాయెల్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.
News January 16, 2025
కాల్పుల విరమణ: కీలక ప్రత్యర్థులను హతమార్చిన ఇజ్రాయెల్
హమాస్‌కు కౌంటర్‌గా ఇజ్రాయెల్ చేసిన దాడిలో గాజా నగరం శిథిలాలుగా మారింది. ఈ 15 నెలల్లో ఇజ్రాయెల్‌పై దాడుల ప్రధాన సూత్రదారి అబ్దల్ హదీ సబా, ఆ గ్రూప్ పొలిట్ బ్యూరో సభ్యుడు కసబ్‌ను చంపేసింది. మరో సూత్రధారి యహ్యా సిన్వర్, హమాస్ చీఫ్ ఇస్మాయిల్ హానియేతో పాటు కీలక నేతలను మట్టుబెట్టినట్లు ఇజ్రాయెల్ పేర్కొంది. మరోవైపు హమాస్‌కు సహకరించిన హెజ్బొల్లా చీఫ్ నస్రల్లాతో పాటు ఆ గ్రూప్‌లోని కీలక నేతలను చంపేసింది.
News January 16, 2025
ఆరు వారాలే ఒప్పందం!
ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం ఆరు వారాల పాటు అమలులో ఉండనున్నట్లు అంతర్జాతీయ కథనాలు తెలిపాయి. దీనిలో భాగంగా ఇజ్రాయెల్ బలగాలు గాజాను వీడనున్నాయి. దీంతో పాటు ఇరు వర్గాలు బందీలను విడుదల చేసేందుకు పరస్పరం అంగీకారం తెలిపాయని వెల్లడించాయి.