News September 3, 2024

బఫర్ జోన్‌లో ఇళ్లు కట్టడం వల్లే ప్రమాదం!

image

TG: ఖమ్మంలో మున్నేరు నది బఫర్ జోన్‌ను ఆక్రమించి ఇళ్ల నిర్మాణాలు చేపట్టడంతోనే చాలా మంది వరదకు ప్రభావితమయ్యారు. గతంలో 36 అడుగుల వరద ప్రవాహం ఉన్నా ఖమ్మం నగరాన్ని తాకలేదు. ఈసారి తక్కువ సమయంలోనే వందలాది ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఫస్ట్ ఫ్లోర్ వరకు నీళ్లొచ్చాయి. మరోవైపు చెరువులు, నాలాలను పూడ్చేసి వెంచర్లు వేశారు. దీంతో అవి కుంచించుకుపోయి వరద ప్రవాహం నగరాన్ని ముంచేసింది.

Similar News

News November 27, 2025

సేమ్ ప్రపోజల్: ఇప్పుడు స్మృతి.. అప్పట్లో బీర్వా షా..

image

స్మృతి మంధానతో వివాహం ఆగిపోవడంతో మాజీ గర్ల్‌ఫ్రెండ్‌తో పలాశ్ పాత ఫొటోలు SMలో వైరల్ అవుతున్నాయి. ఇటీవల అతడు స్మృతిని స్టేడియంలోకి తీసుకెళ్లి మోకాళ్లపై కూర్చొని ప్రపోజ్ చేశారు. 2017లో అచ్చం ఇలాగే మాజీ ప్రియురాలు బీర్వా షాకు కూడా ప్రపోజ్ చేసిన ఫొటోలు బయటికొచ్చాయి. ఎంగేజ్‌మెంట్ చేసుకోవాలనుకున్న తరుణంలో 2019లో వీరిద్దరూ అనూహ్యంగా విడిపోయారు. ఇప్పుడు స్మృతి-పలాశ్ పెళ్లిపైనా నీలినీడలు కమ్ముకున్నాయి.

News November 27, 2025

8,868 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

రైల్వేలో 8,868 గ్రాడ్యుయేట్, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. డిగ్రీ అర్హతతో 5,810 పోస్టులు, ఇంటర్ అర్హతతో 3,058 పోస్టులు ఉన్నాయి. CBT, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. గ్రాడ్యుయేట్ పోస్టులకు 18-33ఏళ్లు, అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు 18-30ఏళ్లవారు అర్హులు. మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.

News November 27, 2025

APPLY NOW: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2700 పోస్టులు

image

బ్యాంక్ ఆఫ్ బరోడా(BOB)లో డిగ్రీ అర్హతతో 2,700 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం అప్రెంటిస్‌లలో TGలో 154, APలో 38 ఉన్నాయి. వయసు 20-28ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. NATS/ NAPS పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆన్‌లైన్ ఎగ్జామ్, DV, లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. ఎంపికైనవారికి నెలకు రూ.15,000 చెల్లిస్తారు.