News September 3, 2025
కన్న కూతురు, అన్న కూతురు దూరం!

TG: హరీశ్ రావు, సంతోశ్ రావులపై అవినీతి ఆరోపణలు చేసిన కవితను నిన్న BRS సస్పెండ్ చేసింది. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న KCR అన్న కూతురు రమ్యా రావు సైతం గతంలో పార్టీకి దూరమయ్యారు. స్వయాన కేసీఆరే ఆమెకు కాళ్లు కడిగి కన్యాదానం చేశారు. అయితే కుటుంబ కలహాలతో రమ్య తెలంగాణ ఆవిర్భావానికి ముందే పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఆమె KCR, సంతోశ్ రావులపై తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేయడం అప్పట్లో సంచలనమైంది.
Similar News
News September 20, 2025
ఐటీ కంపెనీలపై ఎఫెక్ట్ ఇలా..!

భారత ఐటీ దిగ్గజాలైన ఇన్ఫోసిస్, TCS, విప్రో, HCL లాంటి సంస్థలు USలో పని చేస్తూ భారతీయులను రిక్రూట్ చేసుకుంటాయి. H1B వీసా అప్లికేషన్ ఫీజు పెంపుతో వాటిపై తీవ్ర ప్రభావం పడనుంది. ఒక్కో ఉద్యోగిపై లక్ష డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. దీనివల్ల కంపెనీల లాభాలు తగ్గిపోతాయి. ఫలితంగా ఆ సంస్థలు ఇండియా లేదా ఇతర దేశాలకు తరలివెళ్లే అవకాశం ఉంటుంది. దీంతో భారతీయులు అమెరికా వెళ్లకుండా ఇక్కడే ఉద్యోగాలు చేసుకోవచ్చు.
News September 20, 2025
ఆసియా కప్: సూపర్-4లో భారత్ షెడ్యూల్ ఇదే

ఆసియా కప్‌లో ఇవాళ్టి నుంచి సూపర్-4 సమరం మొదలవనుంది. ఈరోజు తొలి మ్యాచులో బంగ్లాదేశ్, శ్రీలంక జట్లు తలపడనున్నాయి. రేపు ఇండియా, పాక్ మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. 23న SLvsPAK, 24న INDvsBAN, 25న BANvsPAK, 26న INDvsSL మ్యాచులు జరగనున్నాయి. అన్ని మ్యాచులు రా.8 గంటలకు ప్రారంభమవుతాయి. సోనీ స్పోర్ట్స్ ఛానల్, సోనీ లివ్ యాప్‌లో లైవ్ చూడవచ్చు. సూపర్-4లో టాప్-2లో నిలిచిన జట్లు ఈ నెల 28న ఫైనల్ ఆడతాయి.
News September 20, 2025
H1Bలపై ట్రంప్ షాక్.. ఉద్యోగాలు కష్టమే!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ H1B వీసాల ఫీజును <<17767574>>లక్ష డాలర్లకు<<>> పెంచడంతో భారతీయులపై తీవ్ర ప్రభావం పడనుంది. అమెరికాలో భారతీయులకు భారీగా ఉద్యోగాలు తగ్గిపోతాయి. అక్కడ MS చదివేందుకు వెళ్లేవారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గనుంది. ఇప్పటికే MS పూర్తి చేసిన వారు లక్ష డాలర్ల విలువైన ప్రొడక్టివిటీ అందించగలిగితేనే కంపెనీలు వారిని స్పాన్సర్ చేస్తాయి. దీనివల్ల ఎవరిని పడితే వారిని నియమించుకునేందుకు వీలుండదు.