News November 25, 2024
కేర్‌టేకర్ చనిపోయిన రోజే జిరాఫీ మృతి
కొందరికి జంతువులతో ప్రత్యేక బంధం ఏర్పడుతుంది. జంతువులూ అలాంటివారిని ఎంతో ప్రేమిస్తుంటాయి. స్కోప్జే జూలో పనిచేసే కేర్‌టేకర్ ట్రాజ్‌కోవస్కీ కూడా అలాంటి కోవకు చెందినవారే. పదేళ్లపాటు ఫ్లాపీ అనే జిరాఫీని ఎంతో ప్రేమగా చూసుకున్నారు. దానికి ఆహారంతో పాటు అన్ని బాగోగులు చూసుకునేవారు. అయితే, గత ఏడాది నవంబర్ 26న అనుకోకుండా ట్రాజ్‌కోవస్కీ చనిపోగా గంటల వ్యవధిలోనే జిరాఫీ కూడా చనిపోయింది.
Similar News
News November 25, 2024
తుషార్‌ను కొనుగోలు చేసిన RR
CSK మాజీ పేస్ బౌలర్ తుషార్ దేశ్‌పాండేను రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది. అతడి కోసం CSK కూడా పోటీ పడింది. కానీ చివరికి తుషార్‌ను RR రూ. 6.5 కోట్లకు కొనుగోలు చేసింది. సౌతాఫ్రికా పేసర్ కోయెట్జీని గుజరాత్ రూ.2.40 కోట్లకు సొంతం చేసుకుంది. ఇంగ్లిస్‌ను రూ.2.60 కోట్లకు పంజాబ్ కొనుగోలు చేసింది.
News November 25, 2024
ఢిల్లీ బయల్దేరిన సీఎం రేవంత్
TG: సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయల్దేరారు. లోక్‌సభ స్పీకర్ కుమార్తె వివాహ వేడుకలో ఆయన పాల్గొంటారు. అలాగే కాంగ్రెస్ అధిష్ఠానంతోనూ రేవంత్ భేటీ అయ్యే అవకాశం ఉంది. మరోవైపు రాష్ట్రానికి అదానీ ఇచ్చిన రూ.100 కోట్లు వద్దని కొద్దిసేపటి క్రితం రేవంత్ ప్రకటించారు. ఈమేరకు అదానీకి లేఖ రాశారు.
News November 25, 2024
సంచలనం.. T20Iలో ఏడు పరుగులకు ఆలౌట్
అంతర్జాతీయ టీ20ల్లో సంచలనం నమోదైంది. EC2026 ఆఫ్రికా సబ్ రీజియన్ క్వాలిఫయర్ పోటీల్లో భాగంగా నైజీరియాతో మ్యాచ్‌లో ఐవరీ కోస్ట్ 7 పరుగులకే ఆలౌటైంది. T20Iలలో ఇదే అత్యల్ప స్కోర్. తొలుత నైజీరియా 271/4 స్కోర్ చేయగా, ఐవరీ కోస్ట్ 7.3 ఓవర్లలో 7 పరుగులకే కుప్పకూలింది. ఆరుగురు డకౌట్లు కాగా, ముగ్గురు ఒక్కో పరుగు చేశారు. ఓపెనర్ మహ్మద్ 4 రన్స్ చేశారు. గతంలో మంగోలియా 10రన్స్‌కే(vsసింగపూర్) ఆలౌటైంది.