News May 15, 2024
చనిపోయిన కూతురికి వరుడు కావాలట!

కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో చనిపోయిన తమ కూతురికి పెళ్లి చేసేందుకు 30ఏళ్ల క్రితం మరణించిన వరుడు కావాలని ఓ కుటుంబం పత్రికా ప్రకటన చేసింది. 30ఏళ్ల క్రితం పసికందుగా ఉన్న తమ కూతురు మరణించిందని, అప్పటి నుంచి తాము తరచూ సమస్యలు ఎదుర్కొంటున్నామని ఆ కుటుంబం తెలిపింది. అందుకే పెద్దల సూచనతో తమ కూతురి ఆత్మకు శాంతి కలగాలనే ఉద్దేశంతోనే పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించింది. దీనిపై మీ కామెంట్?
Similar News
News April 4, 2026
బ్రహ్మాస్త్రం తయారీకి కావాల్సిన పదార్థాలు

ప్రకృతి సేద్యంలో పెద్ద పురుగులు, చీడపీడల నివారణకు బ్రహ్మాస్త్రాన్ని రైతులు ఉపయోగిస్తున్నారు. బ్రహ్మాస్త్రం తయారీకి కావాల్సిన పదార్థాలు
☛ దేశవాళీ ఆవు లేదా నాటు ఆవు మూత్రం – 10 లీటర్లు
☛ వేప ఆకులు – 2 కిలోలు
☛ సీతాఫలం ఆకులు – 2 కిలోలు
☛ పల్లేరు(బిల్వపత్రం) ఆకులు – 2 కిలోలు
☛ ఉమ్మెత్త ఆకులు – 2 కిలోలు అవసరం.
News April 4, 2026
‘పంచభక్ష్య పరమాన్నాలు’ అంటే తెలుసా?

మంచి భోజనాన్ని మన పెద్దలు ‘పంచభక్ష్య పరమాన్నాలు’ అని పిలుస్తుంటారు. దీని అర్థం మనం తినే పదార్థాలు ఐదు రకాలుగా ఉంటాయని శాస్త్రం చెబుతోంది.
భక్ష్యం: గారెలు, బూరెలు వంటి కొరికి తినే పదార్థాలు.
భోజ్యం: పులిహోర, దద్దోజనం వంటి నమిలి తినేవి.
చోష్యం: పాయసం, చారు వంటి జుర్రుకునేవి.
లేహ్యం: తేనె, చలివిడి వంటి నాకబడేవి.
పానీయం: నీళ్లు, పండ్ల రసం వంటి తాగే పదార్థాలు.
News April 4, 2026
పాయింట్ల టేబుల్లో పంజాబ్ ‘కింగ్’

IPL-2026లో ఇప్పటివరకు ఆడిన 2 మ్యాచుల్లోనూ గెలిచిన ఏకైక జట్టుగా PBKS నిలిచింది. దీంతో ఆ టీమ్ 4 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా కొనసాగుతోంది. అదే సమయంలో CSK ఆడిన 2 మ్యాచుల్లో ఓడి పాయింట్ల ఖాతా తెరవలేదు. -2.562 నెట్ రన్‌రేట్‌తో అట్టడుగు స్థానంలో నిలిచింది. SRH 2 ఆడి ఒకదాంట్లో గెలవగా, KKR 2 మ్యాచుల్లోనూ ఓడి పాయింట్లు సాధించలేదు. RR, RCB, DC, MI ఒక్కో మ్యాచ్ ఆడి గెలవగా(2 పాయింట్లు), GT, LSG ఓడిపోయాయి.


