News June 29, 2024
ఇంటర్ ప్రవేశాల గడువు జులై 31 వరకు పొడిగింపు

TG: ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల గడువును జులై 31 వరకు అధికారులు పొడిగించారు. ఈ మేరకు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని సూచించారు. షెడ్యూల్ ప్రకారం రేపటితో గడువు ముగియనుండగా, టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాల్లో పాసైన విద్యార్థుల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులు టెన్త్ మార్కుల మెమో, ఆధార్ సమర్పించాలన్నారు.
వెబ్సైట్: acadtsbie.cgg.gov.in
Similar News
News November 8, 2025
USలో 10 లక్షలకు పైగా ఉద్యోగాల్లో కోత

AI, ఆటోమేషన్, ఇన్ఫ్లేషన్, టారిఫ్‌లు.. వెరసి US జాబ్ మార్కెట్ సంక్షోభంలో పడింది. OCTలో 1,53,074 జాబ్స్‌కు కోత పడినట్లు ‘ఛాలెంజర్ గ్రే క్రిస్టమస్’ తెలిపింది. SEPతో పోలిస్తే 3 రెట్లు అధికమని పేర్కొంది. 2025లో ఇప్పటివరకు లేఆఫ్‌ల సంఖ్య 1.09Mకు చేరినట్లు వెల్లడించింది. కరోనా తర్వాత అత్యధిక లేఆఫ్‌లు ఇవేనని చెప్పింది. కాగా గత 2 ఏళ్లతో పోలిస్తే జాబ్ మార్కెట్ ఇప్పుడే స్లో అయినట్లు నిపుణులు పేర్కొన్నారు.
News November 8, 2025
AP న్యూస్ రౌండప్

☛ కళ్యాణదుర్గంలో భక్త కనకదాసు జయంతి వేడుకల్లో పాల్గొన్న మంత్రి లోకేశ్.. తమ జీవితాంతం అనంతపురం నేలకు రుణపడి ఉంటామని హామీ
☛ తిరువూరు వివాదం.. CBNకు TDP క్రమశిక్షణ కమిటీ నివేదిక
☛ వివేకా హత్య కేసులో దోషులను జగన్ వెనకేసుకొస్తున్నారు: ఆదినారాయణ రెడ్డి
☛ ప్రభుత్వంపై అభ్యంతరకర వ్యాఖ్యల కేసులో సీదిరి అప్పలరాజుకు నోటీసులు.. కాశీబుగ్గ PSలో 3గంటలుగా ప్రశ్నిస్తున్న పోలీసులు
News November 8, 2025
ఇతిహాసాలు క్విజ్ – 60 సమాధానాలు

1. కృష్ణుడి మొదటి గురువు ‘సాందీపని’.
2. కృష్ణుడు పెరిగిన వనాన్ని ‘బృందావనం’ అని అంటారు.
3. నాగులకు తల్లి ‘కద్రువ’.
4. కుంభకర్ణుడి నిద్రకు కారణమైన దేవుడు ‘బ్రహ్మ’.
5. స్కందుడు అంటే ‘కుమారస్వామి’.
<<-se>>#Ithihasaluquiz<<>>


