News May 25, 2024
వారంలో ముగుస్తున్న ‘హైదరాబాద్’ ఉమ్మడి రాజధాని గడువు

AP, TGలకు ఉమ్మడి రాజధానిగా HYD గడువు జూన్ 2తో ముగియనుంది. 2016లో 90% AP కార్యాలయాలు విజయవాడ, గుంటూరు ప్రాంతాలకు తరలిపోగా.. ఇటీవల ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ప్రధాన కార్యాలయాన్ని కర్నూలుకు మార్చారు. HYDలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న భవనాలను జూన్ 2లోగా ఖాళీ చేయాలని TG ప్రభుత్వం నోటీసులు ఇవ్వగా.. అన్ని భవనాలను ఏపీ అప్పగించనుంది. దీంతో ఏపీ ప్రభుత్వానికి HYDతో రుణం తీరిపోనుంది.
Similar News
News October 27, 2025
రేషన్ షాపుల్లో 20% అధిక నిల్వలు: మనోహర్

AP: తుఫాను నేపథ్యంలో MLS(మండల స్థాయి స్టాక్ కేంద్రాలు), రేషన్ షాపుల్లో 20% అధిక నిల్వలు ఉంచినట్లు మంత్రి మనోహర్ తెలిపారు. తీరప్రాంత జిల్లాల్లో 40% వరకు సరకు తరలింపు పూర్తయిందన్నారు. మరోవైపు ధాన్యం కొనుగోలులో రైతులను మిల్లర్లు ఇబ్బందులకు గురి చేయొద్దన్నారు. 50 వేల టార్పాలిన్లు, ఇతర సామగ్రిని అందుబాటులో ఉంచామని చెప్పారు. ధాన్యం సేకరణ కేంద్రాల్లోని టార్పాలిన్లను రైతులు వాడుకోవచ్చని స్పష్టం చేశారు.
News October 27, 2025
బస్సు ప్రమాదం.. ప్రయాణికులకు RTC గమనిక

కర్నూలులో ట్రావెల్స్ బస్సు ప్రమాదం నేపథ్యంలో TGSRTC ప్రకటన జారీ చేసింది. ‘ప్రయాణికుల క్షేమమే ధ్యేయంగా లహరి, రాజధాని వంటి AC బస్సుల్లో వెనుక అత్యవసర ద్వారం, కిటికీ అద్దాలు పగులగొట్టేందుకు సుత్తెలు, మంటలు ఆర్పే పరికరాలు, డీలక్స్, ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు బస్సుల్లో కుడి వైపు, వెనుక భాగంలో అత్యవసర ద్వారం, అగ్నిమాపక యంత్రం అందుబాటులో ఉంటాయి. RTC బస్సుల్లో ప్రయాణం సురక్షితం’ అని ట్వీట్ చేసింది.
News October 27, 2025
సామాన్య కార్యకర్తను అందలం ఎక్కించాం: నాదెండ్ల

AP: సామాన్య కార్యకర్తను అందలం ఎక్కించిన ఏకైక పార్టీ జనసేన అని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. కొట్టే సాయిని శ్రీకాళహస్తి ఆలయ బోర్డు ఛైర్మన్గా ఎంపిక చేయడం దీనికి నిదర్శనమని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ యువతకు తగిన అవకాశం కల్పించాలని Dy.CM పవన్ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. కొత్త నాయకత్వాన్ని తీసుకురావాలన్నదే జనసేన లక్ష్యమని ఆలయ ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారోత్సవంలో మాట్లాడారు.


