News September 3, 2024

‘దేవా’ పేరుకు డిమాండ్ ఎక్కువ!

image

స్టార్ హీరోల సినిమాల్లో ‘దేవా’ పేరు మారుమోగుతోంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ ‘సలార్’లో ఆయన పేరు ‘దేవా’నే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ – కొరటాల శివ కాంబోలో రాబోతున్న ‘దేవర’లోనూ హీరో ‘దేవా’గా కనిపించనున్నారు. తాజాగా లోకేశ్ కనగరాజ్ తెరకెక్కిస్తోన్న ‘కూలీ’ సినిమాలో సూపర్ స్టార్ రజినీకాంత్ ‘దేవా’ రోల్ పోషిస్తున్నారు. దీంతో ‘దేవా’ పేరుకు ఇంత క్రేజ్ ఏంటని నెట్టింట చర్చ జరుగుతోంది.

Similar News

News December 21, 2025

INS సింధుఘోష్‌‌కు వీడ్కోలు

image

‘రోర్ ఆఫ్ ది సీ’గా పేరు పొందిన INS సింధుఘోష్‌ సబ్‌మెరైన్‌కు వెస్టర్న్ నావల్ కమాండ్ నేడు వీడ్కోలు పలికింది. ఇండియన్ నేవీకి 40 ఏళ్లుగా సేవలందిస్తున్న ఈ రష్యన్ బిల్ట్ డీజిల్-ఎలక్ట్రిక్ సబ్‌మెరైన్ యాంటీ షిప్పింగ్, యాంటీ సబ్‌మెరైన్ వార్‌ఫేర్‌లో కీలకభూమిక పోషించింది. నీటిపై 20km/h, సముద్ర గర్భంలో 35km/h వేగంతో ప్రయాణించగలదు. 9M36 Strela-3 ఎయిర్ డిఫెన్స్ మిసైల్ లాంచర్, టార్పెడోలు దీని రక్షణ సామర్థ్యాలు.

News December 21, 2025

రవితేజ కీలక నిర్ణయం!

image

వరుస ఫ్లాపుల్లో ఉన్న హీరో రవితేజ కీలక నిర్ణయం తీసుకున్నారు. సంక్రాంతికి విడుదల కానున్న ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’లో ‘మాస్ మహారాజా’ ట్యాగ్‌ను ఉపయోగించవద్దని సూచించినట్లు డైరెక్టర్ కిశోర్ తిరుమల వెల్లడించారు. మరోవైపు ఈ మూవీకి ఇప్పటివరకు ఆయన ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదని నిర్మాత సైతం వెల్లడించారు. వచ్చే నెల 13న విడుదల కానున్న ఈ మూవీ రవితేజకు హిట్టు లోటు తీరుస్తుందేమో చూడాలి.

News December 21, 2025

పడుకునే ముందు ఇవి తింటే?

image

లవంగాన్ని రోజు తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పడుకునే ముందు ఒక లవంగాన్ని తినడం లేదా నానబెట్టిన నీరు తాగితే జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుందని అంటున్నారు. దీనిలోని యాంటీమైక్రోబయల్ లక్షణాలే ఇందుకు కారణమని చెబుతున్నారు. ఒత్తిడిని తగ్గించి, మంచి నిద్రకు సాయపడుతుందంటున్నారు. ఎక్కువ మోతాదులో తీసుకోకపోవడం ఉత్తమమని సూచిస్తున్నారు.