News August 5, 2024

ఆ వివరాలు వెల్లడించలేం: రక్షణ శాఖ

image

దేశ‌ సాయుధ ద‌ళాల్లోని వివిధ విభాగాల్లో ఉన్న ఖాళీల వివ‌రాలు, వాటి భ‌ర్తీకి తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను బ‌హిర్గతం చేయ‌డం దేశ భ‌ద్ర‌త‌కు మంచిదికాద‌ని కేంద్ర ర‌క్ష‌ణ శాఖ తెలిపింది. ఇది సున్నిత‌మైన అంశ‌మని పేర్కొంది. సాయుధ ద‌ళాల్లోని ఖాళీలు, వాటి భ‌ర్తీపై కాంగ్రెస్‌ ఎంపీ అనిల్ కుమార్ యాద‌వ్ అడిగిన ప్ర‌శ్న‌కు కేంద్ర ర‌క్ష‌ణ శాఖ స‌హాయ మంత్రి సంజ‌య్ సేథ్ ఈ మేర‌కు బ‌దులిచ్చారు.

Similar News

News November 27, 2025

లోకేశ్ విమాన ప్రయాణాలపై TDP క్లారిటీ.. YCP కౌంటర్

image

AP: మంత్రి లోకేశ్‌ విమాన ప్రయాణాలకు ప్రభుత్వ డబ్బులు వాడారన్న విమర్శలపై ఆర్టీఐ వివరాలతో TDP క్లారిటీ ఇచ్చింది. 77 సార్లు ప్రత్యేకంగా విమానాల్లో ప్రయాణించినా ఒక్క రూపాయి కూడా ప్రభుత్వ నిధులు ఉపయోగించలేదని పేర్కొంది. ప్రయాణాలన్నింటికీ లోకేశ్ సొంత సొమ్ము వెచ్చించినట్లు సంబంధిత వివరాలను షేర్ చేసింది. అదే నిజ‌మైతే బ్యాంక్ స్టేట్‌మెంట్‌ను బ‌య‌ట పెట్టాలంటూ YCP కౌంటర్ ఇచ్చింది.

News November 27, 2025

ఇతిహాసాలు క్విజ్ – 79 సమాధానాలు

image

ఈరోజు ప్రశ్న: శ్రీకాళహస్తి క్షేత్రానికి ఆ పేరు ఎలా వచ్చింది?
సమాధానం: శివ భక్తులైన మూడు జీవులు శివుడి కోసం తమ ప్రాణాలను అర్పించి మోక్షం పొందాయి. అవే.. శ్రీ (సాలెపురుగు), కాళ (పాము), హస్తి (ఏనుగు). ఈ 3 జీవులు శివుడిని అత్యంత భక్తితో పూజించి, స్వామి అనుగ్రహం పొంది అక్కడే లీనమయ్యాయి. వీటి పేర్ల కలయికతోనే ఈ పుణ్యక్షేత్రానికి శ్రీకాళహస్తి అనే పేరు స్థిరపడింది.
<<-se>>#Ithihasaluquiz<<>>

News November 27, 2025

సర్పంచ్ ఎన్నికలు.. Te-Poll యాప్‌తో ఈజీగా..

image

TG: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం Te-Poll అనే మొబైల్ యాప్ తీసుకొచ్చింది. గూగుల్ ప్లే స్టోర్‌ నుంచి దీన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇందులో పౌరులు తమ పోలింగ్ స్టేషన్ వివరాలు తెలుసుకోవడంతో పాటు ఓటర్ స్లిప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చని SEC తెలిపింది. అలాగే ఫిర్యాదులను సులభంగా అప్‌లోడ్ చేసి, వాటిని ట్రాక్ చేయవచ్చని పేర్కొంది.
Share It