News March 18, 2024
ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల వివరాలు ఇలా..!

మహబూబ్ నగర్ స్థానిక ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల జాబితాను అధికారులు సిద్ధం చేశారు. MBNR-245, NRPT-205, కొడంగల్-56,WNPT-218, GDWL-225, NGKL-101, కొల్లాపూర్-67, అచ్చంపేట-79, కల్వకుర్తి-72, షాద్ నగర్-171 ఓటర్లు ఉన్నారు. 83 ZPTCలు, 888 MPTCలు, 449 వార్డు కౌన్సిలర్లతో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన 14 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు, ముగ్గురు ఎమ్మెల్సీలు, 19 ఎక్స్అఫీషియో హోదాలో ఓటు వేయనున్నారు.
Similar News
News March 26, 2026
MBNR: హత్యాయత్నం కేసులో ముగ్గురికి జైలుశిక్ష

భూవివాదం నేపథ్యంలో జరిగిన హత్యాయత్నం కేసులో ముగ్గురు నిందితులకు గౌరవనీయ కోర్టు శిక్ష ఖరారు చేసింది. 2023 జనవరి 31న చన్నారెడ్డిపల్లి గ్రామ పరిధిలో బాధితుడు యెరుకలి చెన్నయ్యపై నిందితులు యెరుకలి వెంకటయ్య A1, శ్రీను A2, మల్లేష్ A3 కలిసి ప్రాణాంతక దాడికి పాల్పడ్డారు. పోలీసులను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. నేరస్తులకు శిక్ష పడేలా కృషి చేసిన నవాబ్‌పేట్ పోలీసుల పనితీరును ఆయన కొనియాడారు.
News March 26, 2026
MBNR: పెండింగ్ కేసుల వేగవంతమైన పరిష్కారంపై దృష్టి: ఎస్పీ

మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ డి.జానకి మహబూబ్‌నగర్ జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్లో గురువారం జిల్లాలోని అన్ని పోలీసు అధికారులతో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న గ్రేవ్, నాన్-గ్రేవ్ కేసులు, మిస్సింగ్ కేసులు, ఎన్బీడబ్ల్యూ (NBW), ఎస్సీ/ఎస్టీ కేసుల పురోగతిని సమగ్రంగా సమీక్షించారు. పెండింగ్ కేసులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
News March 26, 2026
సబ్సిటీ రుణాలను సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్

ఎస్సీ కులాల సేవా సహకార అభివృద్ధి సంఘం ద్వారా అందించే రుణాలను సద్వినియోగం చేసుకోవాలని మహబూబ్‌నగర్ కలెక్టర్ కుష్బూ గుప్తా అన్నారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఎస్సీ యాక్షన్ ప్లాన్ 2025-26 కింద రూ.లక్ష లోపు రుణాలపై 90% సబ్సిడీ, రూ.3లక్షల లోపు రుణాలకు 70 శాతం సబ్సిడీ, రూ.3లక్షల నుంచి రూ.7లక్షల లోపు రుణాలకు 60 శాతం సబ్సిడీ ఇస్తున్నట్టు ఆమె వెల్లడించారు.


