News March 17, 2024

ఉమ్మడి మెదక్ జిల్లాలో వర్షపాతం వివరాలు ఇలా..

image

ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా రాత్రి భారీ వర్షం కురిసింది. ఈరోజు ఉ. 8:30 గంటల వరకు గడచిన 24 గంటల్లో ఏడబ్ల్యూఎస్ స్టేషన్లలో నమోదైన వర్షపాతం వివరాలు.. చిన్న శంకరంపేట 37.5 మిల్లీమీటర్లు, చేగుంట 34.8, దౌల్తాబాద్ 31.0, తుక్కాపూర్ 26.3, మాసాయిపేట 22.0, ఝరాసంఘం 21.8, నారాయణరావుపేట 20.0, కొల్చారం 19.0, కౌడిపల్లి 15.5, సత్వార్ 14.8, శనిగరం 14.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది.

Similar News

News April 3, 2025

 వేసవి సెలవులు.. మీ పిల్లలు జాగ్రత్త: మెదక్ ఎస్పీ

image

మైనర్లకు సరదా కోసం బైకులు ఇస్తే మీ జీవితంలో కొత్త సమస్యలు కొని తెచ్చుకున్నట్లేనని మెదక్ ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. పిల్లల ఈత సరదా తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని మిగిలించవద్దని అన్నారు. వేసవి సెలవులు వస్తున్నాయని, మీ పిల్లలు బావులు, చెరువుల, వాగుల్లో ఈతకు వెళ్లే క్రమంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలన్నారు. లేదంటే ఈత సరదా ప్రమాదంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు.

News April 3, 2025

MDK: ఈనెల 4న విద్యుత్ సమస్యలపై గ్రీవెన్స్

image

విద్యుత్ వినియోగదారుల సమస్యలపై మెదక్ జిల్లా విద్యుత్ శాఖ సర్కిల్ కార్యాలయంలో ఈనెల 4న సి.జి.ఆర్.ఎఫ్(కస్స్యూమర్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ ఫోరమ్) హైదరాబాద్ ఆధ్వర్యంలో గ్రీవెన్స్‌డే నిర్వహించనున్నట్టు మెదక్ జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఏ.శంకర్ తెలిపారు. సమస్యల పరిష్కారానికి హాజరయ్యేవారు ఆధార్ కార్డు, కరెంటు బిల్లు రసీదు తీసుకొని రావాలని సూచించారు.

News April 2, 2025

‘పాపన్న గౌడ్ ఆశయాల సాధనకు కృషి చేయాలి’

image

బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. బుధవారం ఐడిఓసిలో బిసి సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి వేడుకలకు అదనపు కలెక్టర్ నగేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సర్వాయి పాపన్న గౌడ్ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బీసీ సంఘం నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

error: Content is protected !!