News March 22, 2024
ఫిర్యాదుదారుడి వివరాలు బహిర్గతం.. ఇద్దరు సస్పెండ్
AP: ఎన్నికల సంఘం సీ-విజిల్ యాప్లో ఫిర్యాదు చేసిన వ్యక్తి వివరాలు బహిర్గతం చేయడంతో ఇద్దరు అధికారులు సస్పెండ్ అయ్యారు. ఏలూరు(D) ఉంగుటూరు మండలం రామచంద్రాపురంలో లైబ్రరీ, వాటర్ ప్లాంట్కు పార్టీ రంగులు ఉన్నాయంటూ స్థానికుడు ఫిర్యాదు చేశారు. అధికారులు స్పందించి తెల్లరంగు వేయించారు. అయితే అతడి వివరాలు స్థానిక నాయకులకు చేరవేశారంటూ పత్రికల్లో కథనాలు రావడంతో.. కలెక్టర్ స్పందించి ఇద్దరిని సస్పెండ్ చేశారు.
Similar News
News December 28, 2024
నితీశ్ కుమార్ రెడ్డికి నగదు బహుమతి
AP: ఆస్ట్రేలియాపై సెంచరీ చేసిన నితీశ్ కుమార్ రెడ్డికి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ నజరానా ప్రకటించింది. అతడికి రూ.25 లక్షల నగదు బహుమతి ఇవ్వనున్నట్లు ACA ప్రెసిడెంట్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడించారు. త్వరలో సీఎం చేతుల మీదుగా నగదు అందిస్తామని పేర్కొన్నారు. ఏపీకి కూడా ఐపీఎల్ టీమ్ సిద్ధం చేస్తామని, అమరావతిలో ఇంటర్నేషనల్ సౌకర్యాలతో స్టేడియం నిర్మిస్తున్నామని చెప్పారు. నితీశ్ స్వస్థలం వైజాగ్.
News December 28, 2024
సిఫార్సు లేఖలపై నిర్ణయం తీసుకోలేదు: టీటీడీ ఈవో
తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలకు అనుమతిచ్చే విషయమై టీటీడీ ఈవో శ్యామలరావు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంకా దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ సమయంలో దాతలకు ప్రత్యేకంగా గదుల కేటాయింపు ఉండదన్నారు.
News December 28, 2024
ఆస్ట్రేలియన్లకు తెలుగోడి దెబ్బలు!
ఆస్ట్రేలియన్లకు తెలుగోళ్లు కొరకరాని కొయ్యలుగా మారారు. కంగారూలపై అప్పట్లో జైసింహా, అజహరుద్దీన్, వీవీఎస్ లక్ష్మణ్.. ఇప్పుడు నితీశ్ కుమార్ రెడ్డి తమ సత్తా చూపించారు. ముఖ్యంగా మన లక్ష్మణుడు కంగారూల విజయాలకు లక్ష్మణరేఖలు గీస్తే.. తాజాగా నితీశ్ హీరో అయ్యారు. ఈ సీజన్ BGTలో భారత్ తరఫున అత్యధిక రన్స్ చేసింది ఈ తెలుగు కుర్రాడే.