News October 3, 2024
ఫామ్ హౌస్‌లు ఎక్కడున్నాయో వివరాలు బయట పెట్టాలి: సబిత

TG: అక్రమంగా నిర్మించిన సబిత ఫామ్ హౌస్‌ను కూల్చాలా? అన్న సీఎం రేవంత్‌కు మాజీ మంత్రి సబిత కౌంటర్ ఇచ్చారు. తన అబ్బాయి కడుతున్న ఇల్లు మినహాయించి 3 ఫామ్ హౌస్‌లు ఎక్కడున్నాయో వివరాలను ప్రజల ముందు పెట్టాలని డిమాండ్ చేశారు. ఎన్ని రకాలుగా తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసినా ప్రజల తరఫున ప్రశ్నిస్తూనే ఉంటానని చెప్పారు. రేవంత్ మాట తీరును తెలంగాణ సమాజం గమనిస్తుందని Xలో పేర్కొన్నారు.
Similar News
News February 23, 2026
మూడో ప్రపంచ యుద్ధం మొదలైంది: జెలెన్‌స్కీ సంచలన వ్యాఖ్యలు!

రష్యా అధ్యక్షుడు పుతిన్ అప్పుడే WW-3ని ప్రారంభించారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అభిప్రాయపడ్డారు. పుతిన్‌ను అడ్డుకోవడానికి ప్రపంచ దేశాలు సైనిక, ఆర్థిక ఒత్తిడిని పెంచాలని BBCతో అన్నారు. రష్యా డిమాండ్ చేస్తున్నట్లుగా ఉక్రెయిన్ భూభాగాలను వదులుకొని కాల్పుల విరమణ ఒప్పందం చేసుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇప్పుడు భూభాగాన్ని వదులుకున్నా పుతిన్ మళ్లీ దాడికి దిగుతారని ఆందోళన వ్యక్తం చేశారు.
News February 23, 2026
ఎద్దు అడుగులో ఏడు గింజలు పడితే పంట పలచన

నాగలితో దున్నుతూ విత్తనాలు వేసేటప్పుడు, ఎద్దు వేసే ఒక అడుగు దూరంలో ఏడు గింజలు పడ్డాయంటే అవి చాలా దగ్గర దగ్గరగా పడ్డాయని అర్థం. ఇలా విత్తనాలు మరీ దగ్గరగా మొలిస్తే మొక్కలకు గాలి, వెలుతురు సరిగా అందవు. నేలలోని పోషకాల కోసం మొక్కల మధ్య పోటీ పెరిగి ఏ మొక్కా బలంగా పెరగదు. ఫలితంగా పంట దిగుబడి తగ్గి పలచగా కనిపిస్తుంది. అందుకే పంట ఆశించిన రీతిలో పండాలంటే విత్తనాల మధ్య తగినంత దూరం ఉండాలని ఈ సామెత చెబుతుంది.
News February 23, 2026
జాలి, కరుణ ఎక్కువైతే..?

జాలి, కరుణ ఉండటం మంచిదే! కానీ అది మితిమీరితే పతనం తప్పదని జడభరతుని కథ సూచిస్తోంది. మోక్షానికి చేరువైన భరత మహారాజు, ఓ లేడిపిల్లపై అమిత మమకారం కనబర్చి తపస్సును విస్మరించాడు. మరణప్పుడూ ఆ లేడి ధ్యాసలోనే ఉన్నాడు. దీంతో ఆయన తర్వాతి జన్మలో జింకగా పుట్టాల్సి వచ్చింది. చివరికి 3 జన్మల అనంతరం కానీ ఆయనకు మోక్షం లభించలేదు. ఏదైనా హద్దు దాటితే బంధనంగా మారుతుందని, కర్తవ్య నిష్టను దెబ్బతింటుందని ఈ కథ పరమార్థం.


