News September 26, 2024
‘దేవర’ క్రేజ్ మామూలుగా లేదుగా.. ఒక్క టికెట్ రూ.2వేలు!

ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన ‘దేవర’ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో అనేక చోట్ల రాత్రి ఒంటి గంటకే షోలు ప్రదర్శించనున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లో టికెట్ ధర రూ.2వేలు పలుకుతున్నట్లు పలువురు సోషల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు. ఈ షోలకు ఎక్కువగా అభిమానులే వెళ్లే అవకాశం ఉండటంతో క్యాష్ చేసుకుంటున్నారని చర్చ జరుగుతోంది.
Similar News
News December 2, 2025
చిత్తూరు: 70 బస్సులకు నోటీసులు

కాలేజీ, స్కూల్ బస్సుల యాజమాన్యాలు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని చిత్తూరు DTC నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. వారం రోజులుగా జిల్లాలో తనిఖీలు చేశామన్నారు. జిల్లాలో సుమారు 900 విద్యా సంస్థల బస్సులు ఉన్నాయన్నారు. ఇటీవల 200పైగా బస్సులను తనిఖీ చేశామని.. నిబంధనలు పాటించని 70 బస్సులకు నోటీసులు అందించామని వెల్లడించారు.
News December 2, 2025
తల్లీకూతుళ్ల బంధం ప్రత్యేకం

తల్లీకొడుకూ, తండ్రీకూతుళ్ల బంధాల గురించే అందరూ ప్రస్తావిస్తారు. కానీ తల్లీకూతుళ్ల బంధం ప్రత్యేకమని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఇద్దరి మధ్య ఉన్న స్నేహం, అవగాహన, కూతురు పెరిగే క్రమంలో స్వేచ్ఛగా పంచుకున్న ఆలోచనలు, భావాలు, అనుభవాలతోపాటు హార్మోన్లు దీనికి కారణమని కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. భావోద్వేగాల్ని నియంత్రించే మెదడు నిర్మాణం ఇద్దరిలో ఒకేలా ఉండటమూ ఈ బలమైన బంధానికి ఓ కారణమట.
News December 2, 2025
చంద్రబాబు కేసులను మూసివేయిస్తున్నారు: MLC బొత్స

AP: తనపై ఉన్న అవినీతి కేసులను మూసివేయించేందుకు CM <<18441609>>చంద్రబాబు<<>> అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని YCP MLC బొత్స సత్యనారాయణ ఆరోపించారు. ఫిర్యాదుదారులను బెదిరించి కేసులను ఉపసంహరించుకునేలా చేస్తున్నారని విమర్శించారు. “స్కిల్, అసైన్డ్ ల్యాండ్స్, రింగ్‌రోడ్, ఫైబర్‌నెట్, లిక్కర్ సహా పలు కేసులు ఉన్నప్పటికీ.. అధికారంలోకి వచ్చిన తరువాత వాటిలో పురోగతి లేదు. గవర్నర్ చర్యలు తీసుకోవాలి” అని కోరారు.


