News April 10, 2024
హీరోయిన్‌కి నటికి తేడా అదే: అంజలి
‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ హీరోయిన్ అంజలి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూవీ విజయానికి స్క్రిప్ట్ చాలా ముఖ్యమని చెప్పారు. కంటెంట్‌ను ఎంత స్ట్రాంగ్‌గా డెలివరీ చేస్తే అభిమానులు అంత బాగా ఆదరిస్తారన్నారు. నటి, హీరోయిన్ అనేవి డిఫరెంట్ రోల్స్ అని తెలిపారు. హీరోయిన్‌కు కొన్ని పరిమితులు ఉంటాయని.. నటికి ఎలాంటి పరిధి ఉండదన్నారు. ఏ క్యారెక్టర్ అయినా 100శాతం ఎఫెర్ట్ ఇవ్వడానికి తాను ప్రయత్నిస్తానని చెప్పారు.
Similar News
News November 15, 2024
కీలక వ్యక్తిని నామినేట్ చేసిన డొనాల్డ్ ట్రంప్
US అధ్యక్ష ఎన్నికల్లో గెలిచిన ట్రంప్ తన టీంలోకి కీలక వ్యక్తిని తీసుకోనున్నారు. డెమొక్రటిక్ అధ్యక్ష మాజీ అభ్యర్థి, యాంటీ వ్యాక్సిన్ యాక్టివిస్ట్ రాబర్ట్ కెన్నెడీని నామినేట్ చేశారు. ఆయనకు ఆరోగ్యశాఖను అప్పగించనున్నారు. మరోవైపు, జార్జియాకు చెందిన కాంగ్రెస్‌మెన్ డగ్ కొలిన్స్‌ను వెటరన్స్ ఎఫైర్స్ కోసం నామినేట్ చేశారు. ట్రంప్ ఈసారి తన క్యాబినెట్లోకి మస్క్ వంటి ప్రముఖులను తీసుకుంటున్న విషయం తెలిసిందే.
News November 15, 2024
నేడు అన్నవరంలో గిరిప్రదక్షిణ వేడుక
AP: కార్తీక పౌర్ణమి సందర్భంగా కాకినాడ(D)లోని అన్నవరం సత్యనారాయణ స్వామి గిరి ప్రదక్షిణ వేడుక ఇవాళ జరగనుంది. లక్షన్నర మంది భక్తులు వస్తారనే అంచనాతో అధికారులు పటిష్ఠ ఏర్పాట్లు చేశారు. ఉ.8 గంటలకు స్వామి, అమ్మవార్ల ఊరేగింపు, మ.2కు కొండ దిగువన సత్యరథం ప్రారంభమవుతుంది. ఇక్కడి నుంచే 9.2KM మేర గిరిప్రదక్షిణ జరగనుంది. భక్తులకు ఆహారం, పండ్లు, తాగునీరు, మజ్జిగ అందించేందుకు స్టాల్స్ సిద్ధం చేశారు.
News November 15, 2024
SBI హౌస్ లోన్ తీసుకున్నారా?
SBI మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్ బేస్డ్ లెండింగ్ రేట్స్(MCLR)ను 5 బేసిస్ పాయింట్ల(0.05 శాతం) మేర పెంచింది. దీంతో హౌస్ లోన్ వంటి దీర్ఘకాలిక రుణాలకు సంబంధించిన ఏడాది కాల వ్యవధి MCLR 9 శాతానికి చేరింది. అలాగే 3, 6 నెలల రుణ రేట్లను అదే మేర పెంచింది. అయితే ఓవర్‌నైట్, నెల, రెండేళ్లు, మూడేళ్ల MCLR రేట్లను సవరించలేదు. పెరిగిన రేట్లు ఇవాళ్టి నుంచే అమల్లోకి వస్తాయని SBI ప్రకటించింది.