News February 9, 2025
సీట్ల తేడా ఎక్కువున్నా ఓట్ల వ్యత్యాసం తక్కువే!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739058580059_653-normal-WIFI.webp)
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో BJP, AAP మధ్య ఓట్ల తేడా 2% కంటే తక్కువే ఉంది. BJPకి 45.56% పోలవగా ఆప్‌కు 43.57% వచ్చాయి. కానీ సీట్ల తేడా మాత్రం 26 స్థానాలుగా ఉంది. కాషాయ పార్టీ 48 స్థానాలను గెలుచుకోగా ఆప్ 22 సీట్లకే పరిమితమైంది. అత్యధిక మెజార్టీతో గెలిచిన తొలి ముగ్గురు అభ్యర్థులూ ‘చీపురు’ పార్టీకి చెందినవారే కాగా అత్యల్ప మెజార్టీతో విజయం సాధించిన చివరి ముగ్గురూ కమలం అభ్యర్థులే కావడం గమనార్హం.
Similar News
News February 9, 2025
కేజీ చికెన్ ధర ఎంతంటే?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739066058923_653-normal-WIFI.webp)
హైదరాబాద్‌లో చికెన్ ధరలు గతవారంతో పోలిస్తే కాస్త తగ్గాయి. గత ఆదివారం KG చికెన్ స్కిన్‌లెస్ రేట్ రూ.240-250 ఉండగా ఇవాళ రూ.220-230గా ఉంది. అయితే AP, TGలోని పలు జిల్లాల్లో రేట్లలో తేడాలున్నాయి. ఇటీవల అంతుచిక్కని వైరస్ కారణంగా కోళ్లు చనిపోతున్న కృష్ణా, ప.గో, నిజామాబాద్ జిల్లాల్లో ధర రూ.200 దిగువకు పడిపోయింది. అటు మరికొన్ని ప్రాంతాల్లో కేజీ రూ.280 కూడా పలుకుతోంది. మీ ప్రాంతంలో చికెన్ ధరలు ఎలా ఉన్నాయి?
News February 9, 2025
రేషన్ కార్డులపై ఏమిటీ గందరగోళం?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739065205888_653-normal-WIFI.webp)
TG: ప్రజాపాలన, సర్వేలో వినతుల మేరకు కొత్త రేషన్ కార్డులిస్తామని ప్రభుత్వం తొలుత చెప్పింది. కానీ మీసేవలో మరోసారి దరఖాస్తు చేసుకోవాలంటూ ఇటీవల ప్రచారం జరిగింది. ఇంతలో EC దీనికి బ్రేక్ వేసిందని వార్తలొచ్చాయి. మరోవైపు మీసేవలో అప్లై చేసుకోవడానికి వీలులేదని సర్కార్ చెప్పింది. ఇక కార్డుల జారీకి తాము బ్రేక్ వేయలేదని EC తెలిపింది. వీటన్నింటితో ‘ఇక కార్డులు వచ్చినట్టే’ అని ప్రజలు నిట్టూరుస్తున్నారు.
News February 9, 2025
ఇందిరమ్మ ఇళ్లు.. వారి ఖాతాల్లోకి రూ.లక్ష?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739057229665_893-normal-WIFI.webp)
TG: ఇందిరమ్మ ఇళ్లకు అర్హులను గుర్తించే ప్రక్రియ కొనసాగుతోంది. తొలి విడతలో 4.5L మందిని ఎంపిక చేస్తారని, లబ్ధిదారుల జాబితాను ఇన్‌ఛార్జ్ మంత్రులు ఫైనల్ చేయగానే ఖాతాల్లో డబ్బులు జమ చేస్తారని తెలుస్తోంది. ఫస్ట్ ఫేజ్‌లో లబ్ధిదారులకు ₹లక్ష చొప్పున జమవుతాయని సమాచారం. దీనిపై సర్కార్ ప్రకటన చేయాల్సి ఉంది. రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక నిరంతర ప్రక్రియ అని ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది.