News February 22, 2025
వీడిన సందిగ్ధం.. ఇక సిద్ధమై సత్తా చాటండి!

AP: గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలపై APPSC తాజా ప్రకటనతో సందిగ్ధం వీడింది. రేపు యథాతథంగా పరీక్షలు జరగనుండగా అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకొని ముందుగానే ఎగ్జామ్ సెంటర్లు ఉన్న ఆయా ప్రాంతాలకు చేరుకోండి. మొక్కవోని దీక్ష, ఎన్నో కష్టాలకు ఓర్చి పరీక్షలకు సన్నద్ధమైన అభ్యర్థులంతా మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి. భవిష్యత్తుకు మార్గం చూపే చక్కటి అవకాశం కావడంతో ఓర్పు, నేర్పుతో పరీక్ష రాయండి. ALL THE BEST.
Similar News
News November 21, 2025
పల్నాడు: కాలువల మరమ్మతులలో నిధుల దుర్వివినియోగం

పల్నాడు ప్రాంతంలో గత ప్రభుత్వ హయాంలో మేజర్, మైనర్ కాలువల మరమ్మతులలో కోట్లాది రూపాయల నిధులు దుర్వినియోగమైనట్లు ప్రభుత్వం గుర్తించినట్లు తెలిసింది. అధికారుల సహాయంతో కొందరు నేతలు కాలువలకు మరమ్మతులు చేయకుండానే చేసినట్లు చూపి బిల్లులు చేసుకున్నట్లు సమాచారం. రైతుల ఫిర్యాదు మేరకు విజిలెన్స్ ఎంక్వయిరీకి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది.
News November 21, 2025
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకు US పీస్ ప్లాన్!

రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపేందుకు US ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీకి US 28 పాయింట్లతో కూడిన పీస్ ప్లాన్‌ను అందజేసింది. ఉక్రెయిన్ తన తూర్పు డాన్‌బాస్ ప్రాంతాన్ని వదులుకోవడం, సాయుధ దళాల పరిమాణాన్ని తగ్గించుకోవడం వంటివి అందులో ఉన్నట్లు సమాచారం. తన ప్రమేయం లేకుండా రూపొందించిన ఈ ప్లాన్‌పై జెలెన్ స్కీ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. దీనిపై ట్రంప్‌తో చర్చించే ఛాన్సుంది.
News November 21, 2025
పత్తి, వేరుశనగలో ఈ ఎర పంటలతో లాభం

☛ పత్తి, వేరుశనగ పంటల్లో ఆముదపు పంటను ఎరపంటగా వేసి పొగాకు లద్దె పురుగుల్ని, బంతి మొక్కలు వేసి శనగ పచ్చపురుగులను సులభంగా నివారించవచ్చు.
☛ వేరుశనగలో అలసందలు వేసి ఎర్ర గొంగళి పురుగుల ఉద్ధృతిని తగ్గించవచ్చు.
☛ వేరుశనగలో పొగాకు లద్దెపురుగు నివారణకు ఆముదం లేదా పొద్దుతిరుగుడు పంటను ఎరపంటగా వేసుకోవాలి. ఎకరానికి 100 మొక్కలను ఎర పంటగా వేసుకోవాలి.


